Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rampa Rebellion of 1922: అల్లూరి సీతారామరాజు ‘రంప’ తిరుగుబాటుకు వందేళ్లు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్సవాలు..

Rampa Rebellion of 1922: మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. చింతపల్లి డిగ్రీ కళాశాలలో

Rampa Rebellion of 1922: అల్లూరి సీతారామరాజు ‘రంప’ తిరుగుబాటుకు వందేళ్లు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్సవాలు..
Alluri Seetharama Raju
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2022 | 1:33 PM

Rampa Rebellion of 1922: మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. చింతపల్లి డిగ్రీ కళాశాలలో జరిగే ఉత్సవాలకు కేంద్రమంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు రాజన్న దొర, రోజా హాజరుకానున్నారు. అగ్గి పిడుగు అల్లూరి తొలిసారి దాడి చేసిన చింతపల్లి పోలీసు స్టేషన్‌ పునరుద్ధరణ, పార్కు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.

అల్లూరి తొలి సాయుధ పోరాటం ప్రారంభించే నాటికి మన్యంలో అటవీ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాల ఆగడాలు దారుణంగా ఉండేవి. వారి చేతిలో ఆదివాసీ గిరిజనులు అన్యాయానికి, హింసకు గురయ్యేవాళ్లు. బ్రిటిష్‌ సైనికులను ఎదుర్కోనేందుకు గిరిజనుల దగ్గరున్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవనే అంచనాలతో గిరిజనులతో కలసి పోలీస్‌ స్టేషన్లపై సాయుధ దాడులకు సిద్ధపడ్డారు అల్లూరి.

వరుస దాడులతో వణికిపోయిన బ్రిటీష్ పాలకులు..

అల్లూరి నేతృత్వంలో వరుసగా ఐదురోజులపాటు జరిగిన దాడులు.. ఆధునిక ఆయుధ సంపత్తి ఉన్న తెల్లదొరలను హడలెత్తించాయి. 1922 ఆగస్టు 22న మొదటిసారిగా చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మెరుపుదాడి చేశారు. 12 తుపాకులు, 1595 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్‌నెట్లను తాము సాయుధ దాడిలో స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పోలీస్‌ స్టేషన్‌ దస్త్రాల్లో రాసి అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. తొలి సాయుధ దాడి విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆ మరుసటి రోజయిన ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై, ఆ తరవాత ఆగస్టు 24న రాజవొమ్మంగి స్టేషన్లపై దాడులు కొనసాగించారు. ఆ క్రమంలో అడ్డతీగల, రంపచోడవరం, పోలీస్‌ స్టేషన్లపై దాడులు కొనసాగించారు.

ఎలాంటి రవాణా సాధనాలు లేని ఆ రోజుల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలను పట్టుకెళ్లడం నాటి బ్రిటిష్‌ పాలకులను బిత్తరపోయేలా చేసింది. సమాచారం ప్రత్యర్థులకు చేరకుండా వ్యూహాత్మకంగా గెరిల్లా దాడులు చేశారు. అమాయక గిరిజనుల బాధలను ప్రత్యక్షంగా చూసి, విజ్ఞాపనలతో సమస్యలు పరిష్కారం కావని గ్రహించిన అల్లూరి.. గిరిజన తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. మన్యం వీరుడు చేసిన ఆ సంచలన యుద్ధానికి నూరు వసంతాలు పూర్తికావడంతో తిరుగుబాటు శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. కేంద్రమంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్రమంత్రులు రాజన్నదొర, రోజా హాజరుకానున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..