ఏపీ: ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా.. అధికారుల్లో టెన్షన్.. టెన్షన్..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఆత్మకూరుకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ అయింది. అతడు విజయవాడ- నెల్లూరు రూట్లలో తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు గుర్తించారు.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా.. నెల్లూరులో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇలా అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆత్మకూరుకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ అయింది. అతడు విజయవాడ- నెల్లూరు రూట్లలో తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అటు డ్రైవర్ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు వైరస్ సోకడంతో అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మరో 35 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కాగా, నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 76 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు సంభవించాయి. దీనితో ఇప్పటివరకు అక్కడ 1031 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 450 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అటు 9 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇక 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!
తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!
భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..
ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..
కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..