ముఖ్యమంత్రిని లేపేస్తానంటూ ఫోన్‌.. వ్యక్తి అరెస్ట్‌

బాంబుతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను లేపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్‌ చేశాడు. ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:46 pm, Sat, 11 July 20
ముఖ్యమంత్రిని లేపేస్తానంటూ ఫోన్‌.. వ్యక్తి అరెస్ట్‌

బాంబుతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను లేపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్‌ చేశాడు. ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి పేరు లోకేష్ కుమార్‌ మీనా అని పోలీసులు వెల్లడించారు. జమ్వా రామ్‌గర్‌ ప్రాంతంలోని ఓ గ్రామం నుంచి అతడు ఫోన్ చేసినట్లు స్పెషల్ టీమ్‌ కనుగొందని, ఈ క్రమంలో శుక్రవారం స్థానిక పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. అతడి ఫోన్‌ని సీజ్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వివరించారు. అతడు కాంపిటేటివ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని.. సీఎంను చంపేస్తామని ఎందుకు బెదిరింపు కాల్ చేశాడో విచారణ చేస్తున్నామని పోలీస్‌ అధికారి తెలిపారు.