Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్.. ప్రకటించిన వైట్ హౌస్
Joe Biden: గత మూడేళ్లుగా కరోనా మహహ్మారి ప్రపంచ దేశాలను అతలాతకులం చేస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కరోనా బారిన ఎంతో మంది బలయ్యారు..
Joe Biden: గత మూడేళ్లుగా కరోనా మహహ్మారి ప్రపంచ దేశాలను అతలాతకులం చేస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కరోనా బారిన ఎంతో మంది బలయ్యారు. చాలా మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. కాగా, కరోనా మహమ్మారి అమెరికాను సైతం కుదిపేంది. ఎంతో మందిని బలి తీసుకుంది. కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌తో ప్రస్తుతం వైరస్ అదుపు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా కరోనాపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ప్రస్తుతం జో బైడెన్ అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు బైడెన్. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. అయితే జో బైడెన్ ఐసోలేషన్‌లోనే ఉంటూ తన అధికారిక విధులను నిర్వర్తించనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
US President Joe Biden tests positive for Covid-19: White House pic.twitter.com/pjzQvaFCDI
— ANI (@ANI) July 21, 2022
మరో వైపు అధ్యక్షుడు ఓ సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు, వాటివల్లచోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై మాట్లాడుతూ బైడెన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాతో పాటు పలుదేశాల్లో బైడెన్ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. గ్లోబల్ వార్మింగ్‌పై ప్రసంగంలో తనకు క్యాన్సర్ ఉన్నట్లు ప్రకటించారు జో బైడెన్. ఇది కాస్తా వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడికి క్యాన్సర్ వచ్చిదంటూ వివిధ దేశాల్లో పలువురు నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అమెరికాలోనూ అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే, వెంటనే వైట్ హౌస్ కార్యాలయం వివరణ ఇచ్చింది. బైడెన్ గతంలో తీసుకున్న చర్మ క్యాన్సర్ చికిత్స గురించి ప్రస్తావించినట్లు వైట్ హౌజ్ స్పష్టం చేసింది.