New President of India: భారీ విజయం.. భారత్‌కు 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ఈనెల 25న ప్రమాణ స్వీకారం

New President of India: ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు...

New President of India: భారీ విజయం.. భారత్‌కు 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ఈనెల 25న ప్రమాణ స్వీకారం
Draupadi Murmu
Follow us
Subhash Goud

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2022 | 11:16 AM

New President of India: ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాష్ట్రపతి ఫలితాలు వచ్చేశాయి.మొదటి రౌండ్‌ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్‌ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు. ఇక ముర్ము విజయం ఖాయమంటూ ఫలితాలు వెల్లడి కాకముందే ఒడిశా రాష్ట్రంలో సంబరాలు నెలకొన్నాయి. గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ స్వీట్లు తినిపించుకున్నారు. ద్రౌపది ముర్ము విజయం ఖాయమంటూ ముందుగానే ప్రకటించుకున్నారు. ఇప్పుడు ముర్ము విజయం సాధించడంతో సంబరాలు హోరెత్తిపోతున్నాయి.

హైదరాబాద్‌లో బీజేపీ నాయకుల సంబరాలు:

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము అఖండ విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సంబరాలు ఆకాశాన్నంటాయి. బీజేపీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. డప్పు, వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తున్నారు.