Presidential Election 2022 Results Highlights: భారతదేశ చరిత్రలో సంచలనం.. రాష్ట్రపతిగా తొలి ఆదివాసి మహిళ
Presidential Polls 2022 Highlights: కౌన్ బనేగా నయా రాష్ట్రపతి? కొత్త ప్రెసిడెంట్ ఎవరు? గురువారం సాయంత్రంలోగా తేలిపోయింది. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ముర్ము గెలిచి
Presidential Polls 2022 Highlights: కౌన్ బనేగా నయా రాష్ట్రపతి? కొత్త ప్రెసిడెంట్ ఎవరు? గురువారం సాయంత్రంలోగా తేలిపోయింది. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ముర్ము గెలిచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు. మరోవైపు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఎన్ని ఓట్లు వస్తాయన్న ఆసక్తి కూడా నెలకొనుండగా, సరిగ్గా 11 గంటలకు కౌంటింగ్ ప్రారంభమమైంది. బ్యాలట్ బాక్సులు అన్ని రాష్ట్రాల నుంచి ఇప్పటికే పార్లమెంట్ భవనానికి ఇప్పటికే చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు అధికారులు.
కౌంటింగ్ ప్రాసెస్‌ను చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రానికి రిజల్ట్ తెలుస్తుందన్నారు. ఎంపీల ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఒకసారి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో 10 రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యాక రెండోసారి పోల్ ట్రెండ్స్ గురించి చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడింస్తారు. 20 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యాక ఇంకోసారి బ్రీఫింగ్ ఇస్తారు.. ఆపై కౌంటింగ్ పూర్తయ్యాక రిజల్ట్ ప్రకటించనున్నట్లుగా సమాచారం.
సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతంకుపైగా పోలింగ్ నమోదైంది. 10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటు వేశారు. వీరిలో ఎంపీలు 776 మంది. ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేకపోయారు. పోలింగ్ సమయంలో డియోల్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లగా, ధోత్రే ఐసీయూలో ఉన్నారు. బీజేపీ, శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), ఏఐఎంఐఎంలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయలేదు.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు.
ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ జరిగే కౌంటింగ్ కోసం దేశ్యవాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
LIVE NEWS & UPDATES
-
జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అస్సాంకు చెందిన 22 మంది, బీహార్‌కు చెందిన 6 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో 16 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు.
-
ద్రౌపది ముర్ముకు అమిత్ షా అభినందనలు
ద్రౌపది ముర్ము గెలుపుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అతి సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ఎన్‌డిఎ అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము జీ ఎన్నిక కావడం యావత్ దేశానికి గర్వకారణం, నేను ఆమెను అభినందిస్తున్నాను అని అన్నారు.
-
-
ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన యశ్వంత్ సిన్హా
2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించడంపై విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు రౌండ్లలో ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం లభించింది.
I join my fellow citizens in congratulating Smt Droupadi Murmu on her victory in the Presidential Election 2022.
India hopes that as the 15th President of the Republic she functions as the Custodian of the Constitution without fear or favour. pic.twitter.com/0gG3pdvTor
— Yashwant Sinha (@YashwantSinha) July 21, 2022
-
ద్రౌపది ముర్ము ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మోడీ
15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపులో ముర్ము అఖండ విజయం సాధించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు భారతదేశంలో మారుమూల ప్రాంతంలో జన్మించిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎన్నికైందని ఈ సందర్భంగా మోడీ అభినందించారు.
India scripts history. At a time when 1.3 billion Indians are marking Azadi Ka Amrit Mahotsav, a daughter of India hailing from a tribal community born in a remote part of eastern India has been elected our President!
Congratulations to Smt. Droupadi Murmu Ji on this feat.
— Narendra Modi (@narendramodi) July 21, 2022
-
కాసేపట్లో ముర్ము ఇంటికి ప్రధాని మోడీ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ముర్ము అఖండ విజయం సాధించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపనున్నారు.
-
-
క్రాస్ ఓటింగ్
ద్రౌపది ముర్ము దేశానికి 15వ రాష్ట్రపతి కానున్నారు. ముర్ము క్రాస్ ఓటింగ్ ద్వారా ఇప్పటివరకు 104 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీల మద్దతు పొందారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో 104 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ద్వారా ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు.
-
15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మొదటి గిరిజన రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 3 రౌండ్లలోనూ ద్రౌపది భారీ ఆధిక్యం లభించింది. ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు వచ్చాయి.
-
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం
ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఓటమి చెందారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాష్ట్రపతి ఫలితాలు వచ్చేశాయి.
ఈ ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ముకు ఓట్లు రాగా, యశ్వంత్ సిన్హాకు ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు.
-
విజయం వైపు ద్రౌపది ముర్ము
రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ పోల్ చేసిన మొత్తం ఓట్లలో 72 శాతం ఓట్లతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు.ఇప్పుడు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి.
-
బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాల వాతావరణం
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు.
-
10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తి
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 రాష్ట్రాలకు చెందిన ఓట్లను లెక్కింపు జరిగింది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఫలితాలు రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది
-
ప్ల కార్డులు పట్టుకుని బీజేపీ కార్యకర్తల నినాదాలు
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దాదాపు ఖరారు కావడంతో తెలంగాణలో సంబరాలు జోరందుకున్నాయి. ప్రధాని మోదీ, అభ్యర్థి ద్రౌపది ముర్మూ ప్లకార్డులు పట్టుకుని జై బీజేపీ, జై తెలంగాణ, జై బండి సంజయ్ అంటూ నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఈ సంబరాల్లో బండి సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
-
వేములవాడలో బీజేపీ సంబరాలు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ విజయం దాదాపుగా ఖరారవడంతో బీజేపీలో సంబరాలు మిన్నంటాయి. వేములవాడ రాజన్న ఆలయం ఎదుట బాణసంచా పేలుస్తూ డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకుంటున్న బీజేపీ కార్యకర్తలు.
-
ఆధిక్యంలో కొనసాగుతున్న ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి నుంచి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ముందంజలో ఉన్నారు. ఫలితాలు రాత్రి 8 గంటల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
విజయవాడలోనూ సంబరాలు
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం ఖాయమంటూ విజయవాడలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తీన్మార్ డెన్సులతో ఉత్సాహంగా రాష్ట్ర కార్యాలయంలో చిందులేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు
-
హైదరాబాద్ బీజేపీ నాయకుల సంబరాలు
హైదరాబాద్: నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు కొనసాగుతున్నాయి. ద్రౌపది ముర్ము గెలుపు దిశగా వెళ్తుండగా, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ డప్పు, వాయిద్ఆయలతో బీజేపీ నాయకుల సందడి నెలకొంది.
-
రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు. ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ నేతలు ఓటు వేశారని అన్నారు. క్రాస్ ఓటింగ్‌లో బీజేపీ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకం.
-
రెండో రౌండ్ ముగిసే సరికి ముర్ముకు 1,349 ఓట్లు
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్‌లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి ముర్ముకు 1,349 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు వచ్చాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఎంపీల ఓట్ల విలువ 4,83,299 కాగా, యశ్వంత్‌కు పోలైన ఎంపీల ఓట్ల విలువ 1,79,279.
-
రెండో రౌండ్‌లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యం
ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్‌లోనే ముందంజలో ఉన్నారు.
-
దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తాం: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
నేడు దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశానికి తదుపరి రాష్ట్రపతిని త్వరలో ప్రకటించనున్నారు. ఒక గిరిజన కుటుంబానికి చెందిన ద్రౌపది ముర్ము దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికవుతారని మంత్రి అన్నారు. నేడు కొత్త చరిత్ర సృష్టించబడుతుందని ఒక గిరిజన ఇంటి కుమార్తె దేశానికి తదుపరి రాష్ట్రపతిగా ఎన్నుకోబడుతుండటం గర్వంగా ఉందన్నారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
-
యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము ఆధిక్యం
కొత్త అధ్యక్షుడిని ఎప్పుడైనా ప్రకటించవచ్చు . ఎంపీల తర్వాత ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా రావచ్చు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము గణనీయమైన ఆధిక్యం సాధిస్తోంది.
-
ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు
ఒకటి నుండి ఒకటిన్నర గంటల్లో ఫలితం రావచ్చు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ద్రౌపది ముర్ము గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది.
-
జానపద కళాకారులతో కేంద్ర మంత్రి నృత్యాలు
ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ఎంపీల ఓట్ల లెక్కింపు ముగిశాయి. అయితే ఈ మొదటి రౌండ్‌లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ఇక ముర్ము విజయం ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు రాకముందే ఆమె సొంత రాష్ట్రంలో వేడుకలు జరుపుకొంటున్నారు. జానపద కళాకారులతో కలిసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గిరిజన నృత్యం చేశారు.
#WATCH | Delhi: Union Minister Dharmendra Pradhan joins folk artists as they perform a tribal dance to celebrate as NDA’s Presidential candidate Droupadi Murmu leads against Opposition’s Yashwant Sinha after the end of the first round of counting. pic.twitter.com/bSiCLkipPl
— ANI (@ANI) July 21, 2022
-
రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోడీ
ప్రస్తుతం రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమం రేపు ఢిల్లీలో జరగనుంది. ప్రధానమంత్రి ఆతిథ్యం ఇవ్వనున్నారు. రేపు సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో పదవీవిరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు, విందును ఏర్పాటు చేస్తున్నారు.
-
రేపు ఢిల్లీకి యోగి ఆదిత్యనాథ్
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 24తో తన పదవీ కాలం ముగియనుంది. దీంతో రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే యూపీ ఉప ముఖ్యమంత్రులిద్దరు రాష్ట్రపతి వీడ్కోలు సభకు హాజరు కానున్నారు. జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.
-
మొదటి రౌండ్‌లో చెల్లని ఎంపీ ఓట్లు 15
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ముర్ము ఓట్ల విలువ 3,78,000, యశ్వంత్ సిన్హాకు ఓట్ల విలువ 1,45,600. మొత్తం 4809 ఓట్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా, సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. చెల్లని ఎంపీ ఓట్లు 15 ఉన్నట్లు అధికారులు తేల్చారు.
Droupadi Murmu has secured 540 votes with a value of 3,78,000 and Yashwant Sinha has secured 208 votes with a value of 1,45,600. These are figures for Parliament (votes) pic.twitter.com/Rh11GsLqjj
— ANI (@ANI) July 21, 2022
-
ముర్ము విజయం ఖాయమంటూ పాఠశాలలో వేడుకలు
ఒడిశా: ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పహాద్‌పూర్‌లోని ఎన్‌ఎల్‌ఎస్ మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో వేడుకలు జరుగుతున్నాయి. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని, ఫలితాలు రాకముందే అక్కడి ప్రజలు, విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
#WATCH | Odisha: Celebrations begin at SLS (Shyam, Laxman & Sipun) Memorial Residential School, Pahadpur, founded by NDA’s presidential candidate Droupadi Murmu in memory of her husband & 2 sons after their demise
The counting of votes for the Presidential election is underway. pic.twitter.com/eysgf562jX
— ANI (@ANI) July 21, 2022
-
ముర్ము పోరాట పటిమ ఉన్న నాయకురాలు
ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడే చాలా సంతోషించామని ముర్ము సోదరుడు వ్యాఖ్యానించారు. మా కుటుంబ సభ్యులమంతా హ్యాపీగా ఉన్నాము. గ్రామస్తులు కూడా సంతోషంగా ఉన్నారు. ముర్ము పోరాట పటిమ ఉన్న నాయకురాలు అని అన్నారు.
-
ముగిసిన మొదటి రౌండ్
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. కొత్త రాష్ట్రపతి ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీలో ఉన్నారు. వీరిలో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు మొదటి రౌండ్ ముగిసింది.
-
మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యం
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ముర్ముకు 510, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి. చెల్లనివి 15 ఓట్లు ఉన్నాయి.
Droupadi Murmu has secured 540 votes with a value of 3,78,000 & Yashwant Sinha has secured 208 votes with a value of 1,45,600. A total of 15 votes were invalid. These are figures for Parliament (votes), please wait for next announcement: PC Mody, Secretary General, Rajya Sabha pic.twitter.com/ka0PvmOzpX
— ANI (@ANI) July 21, 2022
-
గెలుపు ప్రకటన రాకముందే ద్రౌపది ముర్ము గ్రామంలో సంబరాలు
ద్రౌపది ముర్ము గ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ప్రకటన రాకముందే ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. బాలికలు, పాఠశాల విద్యార్థినులు నృత్యాలు, పాటలతో సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామంలో 20 వేల లడ్డూలు తయారు చేశారు.
-
ద్రౌపది ఇంటిని ప్రధాని మోదీ
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లనున్నారు.
-
మోడీ మంత్రి వర్గం ద్రౌపతి ముర్ము ఇంటికి..
మోడీ మంత్రివర్గం అంతా ద్రౌపది ముర్ము ఇంటికి చేరుకుని అభినందనలు తెలుపనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత మోడీ మంత్రివర్గం మొత్తం ద్రౌపది ముర్ము ఇంటికి చేరుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. జేపీ నడ్డా కూడా రోడ్ షో చేసిన తర్వాత ద్రౌపది ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో ద్రౌపది నివాసంలో సాధారణ ప్రజలకు అనుమతించనున్నారు.
-
పార్లమెంట్ హౌస్‌లో..
అన్ని రాష్ట్రాల బ్యాలెట్ పత్రాలను క్రమబద్ధీకరించిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభంకానుంది.
#WATCH The process of counting of votes for the Presidential election has started in Parliament#Delhi pic.twitter.com/s8uss15xn3
— ANI (@ANI) July 21, 2022
-
ఎంపీల ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది..
తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
776 మంది ఎంపీల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 763 మంది ఎంపీలు
వీరిలో 719 మంది పార్లమెంటులో తమ ఓటు హక్కు వినియోగించుకోగా, మరో 44 మంది ఎంపీలు వేరువేరు రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
-
ముందుగా ఎంపీల ఓట్లను లెక్కింపు..
రాష్ట్రపతి ఎన్నికల్లో ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అందులో ఇతర ఓట్లను కలుపుతారు.
Delhi | Counting of votes for Presidential election underway in Parliament pic.twitter.com/XBf84ADeEc
— ANI (@ANI) July 21, 2022
-
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..
పార్లమెంట్ హౌస్‌లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వేసిన ఓట్ల బాక్సులను ఇద్దరు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచారు.
#WATCH The process of counting of votes for the Presidential election has started in Parliament#Delhi pic.twitter.com/s8uss15xn3
— ANI (@ANI) July 21, 2022
-
ముర్ము గ్రామంలో విద్యార్థినులు నృత్యాలు..
ద్రౌపది ముర్ము గ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ప్రకటన రాకముందే ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. బాలికలు, పాఠశాల విద్యార్థినులు నృత్యాలు, పాటలతో సంబరాలు చేసుకుంటుండగా.. గ్రామంలో 20 వేల లడ్డూలు తయారయ్యాయి.
-
గిరిజనులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణం
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలు కావడం గిరిజనులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు.
-
మొదలైన లెక్కింపు.. ముర్ము గ్రామంలో లడ్డూలు రెడీ..
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖాయమని భావిస్తున్నారు. అదే సమయంలో ముర్ము గ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా 20 వేల లడ్డూలను సిద్ధం చేశారు.
-
ముర్ము నివాసంలో సన్నాహాలు..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నివాసంలో సన్నాహాలు జరుగుతున్నాయి..
दिल्ली: राष्ट्रपति चुनाव के नतीजे आज घोषित होंगे। एनडीए की राष्ट्रपति पद की उम्मीदवार द्रौपदी मुर्मू के निवास पर तैयारियां की जा रही है। pic.twitter.com/zxWi7516lC
— ANI_HindiNews (@AHindinews) July 21, 2022
-
ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో 10 రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్..
కౌంటింగ్ ప్రాసెస్‌ను చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రానికి రిజల్ట్ తెలుస్తుందన్నారు. ఎంపీల ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఒకసారి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో 10 రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యాక రెండోసారి పోల్ ట్రెండ్స్ గురించి చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడింస్తారు. 20 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యాక ఇంకోసారి బ్రీఫింగ్ ఇస్తారు.. ఆపై కౌంటింగ్ పూర్తయ్యాక రిజల్ట్ ప్రకటించనున్నట్లుగా సమాచారం
-
ఓట్ల లెక్కింపునకు ముందు ద్రౌపది ముర్ము ట్వీట్..
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ద్రౌపది ముర్ము ఓ ట్వీట్ చేశారు. అందులో “జీవితం ఒక అద్దం, మనం నవ్వినప్పుడే అది నవ్వుతుంది” అని రాసుకున్నారు.
जिंदगी एक आइना है, ये तभी मुस्कुराएगी जब हम मुस्कुरायेंगे!?? pic.twitter.com/n4dVZFVoHd
— Droupadi Murmu • द्रौपदी मुर्मू (@DroupadiMurmu__) July 21, 2022
-
బీజేపీ ఆధ్వర్యంలో అభినందన్ యాత్రకు ప్లాన్..
గురువారం సాయంత్రం రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ‘అభినందన్ యాత్ర’ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.
-
రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనుంది.
-
యశ్వంత్ సిన్హాకు 34, ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతు..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి భారీ ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. విపక్షాల అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు 34 పార్టీలు మద్దతు ప్రకటించగా.. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతు ప్రకటించాయి.
-
సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం..
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభం కానుంది. ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వచ్చే అవకాశం ఉంది.
-
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనిది వీరే..
భారతీయ జనతా పార్టీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేకపోయారు. పోలింగ్ సమయంలో డియోల్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లగా, ధోత్రే ఐసీయూలో ఉన్నారు. బీజేపీ, శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), ఏఐఎంఐఎంలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయలేదు.
-
10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్..
సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతంకుపైగా పోలింగ్ నమోదైంది. 10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటు వేశారు. వీరిలో ఎంపీలు 776 మంది. ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.
-
ముర్ము సొంతూరు తుడులో సందడి వాతావరణం..
మరోవైపు ద్రౌపది ముర్ము సొంతూరు ఒడిశాలోని తరనిసేన్ తుడులో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఊరు ఊరంతా ఆనందంగా ఉంది. పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. ఒక గిరిజన మహిళ ఆ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము సోదరుడు.
-
ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్..!
776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 4,809 మంది ఓటర్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ఇందులో ఓటు వేయలేరు. రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌తో పాటు 31 చోట్ల, అసెంబ్లీ పరిధిలోని 30 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
-
పార్లమెంట్ హౌస్‌లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం..
ఇవాళ దేశ 15వ రాష్ట్రపతి నిర్ణయం జరుగనుంది. పార్లమెంట్ హౌస్‌లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను క్రమపద్దతిలో అమర్చనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించనున్నారు.
Published On - Jul 21,2022 9:32 AM