Viral: అచ్చం సినిమాలో మాదిరి.. నిద్రిస్తున్న గొర్రెల కాపరిపై చిరుత దాడి.. పక్కనే ఉన్న గొడ్డలితో

నిద్రిస్తున్న గొర్రెల కాపరిపై విరుచుకుపడింది చిరుత. తన పంజాలతో రక్కేసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ధైర్యంగా ఆ చిరుతపై ప్రతి దాడి చేసి.. తన ప్రాణాలు నిలుపుకున్నాడు.

Viral: అచ్చం సినిమాలో మాదిరి.. నిద్రిస్తున్న గొర్రెల కాపరిపై చిరుత దాడి.. పక్కనే ఉన్న గొడ్డలితో
Leopard
Follow us

|

Updated on: Jul 21, 2022 | 9:30 AM

Karnataka: మీరు మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) నటించిన కొండపొలం(Konda Polam) మూవీ చూశారా..? అందులో గొర్రెలకు కాపరిగా వెళ్లిన హీరో.. తన జీవాలను కాపాడుకునేందుకు పెద్ద పులికి ఎదురొడ్డి పోరాడతాడు. ఇంచుమించు అలాంటి సీనే రియల్ లైఫ్‌లో కూడా జరిగింది. ప్రాణాలు కాపాడుకోడానికి చిరుతతో యుద్ధానికి దిగాడు ఓ గొర్రెల కాపరి. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లా(Vijayanagara district) హరపనహళ్లి తాలూకా కండికేరి ఫారెస్ట్ ఏరియాలో జరిగింది. కండికేరి ప్రాంతంలో నివాసం ఉండే 21 ఏళ్ళ కూగార్‌ కరిబసప్ప మంగళవారం ఉదయం గొర్రెలను మేపటానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో కాస్త అలసట అనిపించి.. ఓ కునుకు వేసేందుకు చిక్కటి నీడ ఉన్న ఓ చెట్టుకింద నిద్రపోయాడు. ఈ క్రమంలో ఎంతసేపు నుంచి మాటు వేసి ఉందో తెలియదు కానీ.. ఒక్కసారిగా దూసుకువచ్చి అతనిపై దాడి చేసింది చిరుత. దీంతో వెంటనే అలర్టైన కరిబసప్ప తన పక్కనే గొడ్డలితో చిరుతపై ప్రతి దాడికి దిగాడు.  దీంతో చిరుత కంగుతింది. తోకముడిచి.. అక్కడి నుంచి జారుకుంది. ఈ క్రమంలో అడవిలోకి జారుకుంటున్న చిరుతను కరిబసప్ప తన సెల్‌ఫోన్‌లో ఫొటో  తీశాడు. చిరుత దాడితో అతని నుదుటిపై గాయమైంది. ఇంటికి వెళ్లి జరిగిన విషయం గ్రామస్థులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. చిరుతను బంధించటానికి బోన్లు ఏర్పాట్లు చేస్తామని.. దాని జాడ తెలుసుకునేందుకు కెమెరాలు పెడతామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

జాతీయ వార్తల కోసం..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..