CM Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి.. కారణమేంటంటే..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. తీవ్ర కడుపునొప్పి తలెత్తడంతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో భగవంత్ చికిత్స తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. తీవ్ర కడుపునొప్పి తలెత్తడంతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో భగవంత్ చికిత్స తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం రాత్రి చండీగఢ్‌లోని తన అధికారిక నివాసంలో తీవ్రమైన కడుపునొప్పితో భగవంత్ అస్వస్థతకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా విమానంలో ఢిల్లీలోని ఆస్పత్రికి చేర్చుకున్నారు. కాగా సీఎం వెంట ఎలాంటి భద్రతా సిబ్బంది లేకపోవడంతో పంజాబ్ ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో ఉండగానే.. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. కాగా పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన భగవంత్‌మాన్ మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గానూ ఆప్ 92 స్థానాలు గెల్చుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇక ఇటీవల రెండోసారి వివాహం చేసుకున్నారు పంజాబ్ సీఎం. తన దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)తో కలిసి పెళ్లిపీటలెక్కారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..