Kejriwal: గుజరాత్ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫోకస్.. భారీ ఉచిత తాయిలం ప్రకటించిన కేజ్రీవాల్
Gujarat Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో గత వారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ భారీ ఉచితాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Gujarat Polls 2022: ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ పార్టీ(AAP) తన నెక్ట్స్ ఫోకస్‌ను గుజరాత్‌కు షిఫ్ట్ చేసింది. డిసెంబరులో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధవుతోంది. గత నెల రోజుల్లో రెండోసారి ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) రెండోసారి గుజరాత్‌లో పర్యటించారు. గురువారంనాడు సూరత్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కిస్తూ కీలక ప్రకటన చేశారు. గుజరాత్ ఓటర్లకు భారీ ఉచిత తాయిలాన్ని ప్రకటించారు. ఆ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ అవసరాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో గత వారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అర్వింద్ కేజ్రీవాల్ భారీ ఉచితాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
गुजरात इस बार भविष्य की तरफ़ देख रहा है। गुजरात की जनता को आम आदमी पार्टी की पहली गारंटी। दिल्ली की तरह गुजरात में भी 24 घंटे मुफ़्त बिजली देंगे | LIVE https://t.co/8A3UxpNXt7
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 21, 2022
గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి తీరుతుందన్న కేజ్రీవాల్.. ఆ మేరకు ఆప్ కన్వీనర్‌గా తాను ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. అలాగే 2021 డిసెంబరు 31కి ముందు జారీ చేసిన అన్ని విద్యుత్ బిల్లులను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. 27 ఏళ్ల బీజేపీ పాలనపై గుజరాత్ ప్రజలు విసిగిపోయారని.. గుజరాత్ రాష్ట్రాభివృద్ధికి ఆప్ దగ్గరున్న సమగ్ర ప్రణాళికలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటనలో.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ మరిన్ని ఉచిత తాయిలాలను ప్రకటించొచ్చని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి