Italian Village: రండి బాబూ రండి.. మా గ్రామంలో వ్యాపారం చేయండి రూ. 24 లక్షలు తీసుకోండి అంటున్న అధికారులు.. కండిషన్స్ అప్లై
Italian Village: ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజల ఆలోచన తీరైనా ఒకేలా ఉంటుందని ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాల ద్వారా తెలుస్తుంది. మనదేశంలోనే కాదు.. యురేపియన్ కంట్రీస్‌లో...
Italian Village: ప్రపంచంలో ఏ దేశంలోని ప్రజల ఆలోచన తీరైనా ఒకేలా ఉంటుందని ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాల ద్వారా తెలుస్తుంది. మనదేశంలోనే కాదు.. యురేపియన్ కంట్రీస్‌లోనైనా ఆఫ్రికా దేశాల్లోని పల్లెప్రజల ఆలోచన ఒకలాగే ఉంటుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం బతుకుదెరువు, కోసం పల్లెలు .. పట్నం బాట పట్టాయి. మరికొందరు పిల్లల చదువులు, ఉద్యోగాలు అంటూ రకరకాల కారణాలతో ఒక ప్రాంతం నుంచి మీరొక ప్రాంతానికి వలస వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్క భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ప్రతి గ్రామంలో జరుగుతున్నదే .. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలు చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అయితే మళ్ళీ తమ ప్రాంతం ప్రజలతో కలకాలాడాలని కొన్ని ప్రభుత్వాలు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. క్రొయేషియా దేశంలో ఓ పట్టణంలో ఇళ్లను కేవలం రూ.12 లకే విక్రయించడానికి రెడీ అయితే.. ఇందుకు కొంచెం భిన్నంగా యురేపియన్ లోని ఇటాలియన్ గ్రామం అలోచించి సరికొత్త పథకంతో ప్రజల ముందుకు వచ్చింది వివరాల్లోకి వెళ్తే..
ఇటలీ దేశంలోని కాలాబ్రియా అనే పట్టణంలో ఇటాలియన్ గ్రామం ఎంతో సుందరంగా ఉంటుంది. సముద్రం, పర్వతాలు, సుందరమైన పచ్చని ప్రకృతి అందాలతో ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంది. అటువంటి ఈ గ్రామం ప్రస్తుతం జనాభా సమస్యను ఎదుర్కొంటుంది. కేవలం ఇక్కడ 2 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు, దీంతో ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇటాలియన్ గ్రామం. దీంతో అక్కడి ప్రభుత్వం ఇటాలియన్ లో నివసించడానికి అక్కడే కొత్తగా వ్యాపారంగా చేయడానికి ఆసక్తి ఉన్నవారిని రమ్మనిమని ఆహ్వానిస్తుంది. అదీ ఈ సుందరమైన గ్రామంలో నివసించిస్తూ బిజినెస్ ను పెట్టుకోవడానికి ప్రభుత్వమే రూ. .24.5 లక్షలు చెల్లిస్తుంది. అయితే ఇలా చెల్లించడానికి కొన్ని కండిషన్స్ పెట్టారు అక్కడ అధికారులు.
సుందరమైన ఇటాలియన్ లో అతి చౌకైన ఇల్లు అమ్మకానికి ఉన్నాయి. ఎవరైనా ఈ ఇంటికి తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ఇంటి యజమాని కావచ్చు. అయితే ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తి వయసై.. 40 ఏళ్ళు లోపు ఉండాలి. ఇక్కడే కనీసం కొన్నేళ్లు పాటు నివసించాలి. ఇంటిని కొనుగోలు చేయడానికి ఇక్కడ వ్యాపారం చేయాలనుకునే వారు దరఖాస్తులను 90 రోజుల్లోపు అధికారులకు అందజేయాలి. ఈ ప్రాజెక్ట్ ను అక్కడ అధికారులు ‘యాక్టివ్ రెసిడెన్సీ ఆదాయం’ అని పేరు పెట్టారు. ఇదే విషయంపై పట్టణ మేయర్ స్పందిస్తూ.. తమ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇటాలియన్ ప్రాంతంలో నివసించడానికి ప్రజలను ఆకర్షించండి.. ఆధునిక సౌకర్యాలను కల్పిస్తామని. మరింత విద్య ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తామని.. హై-స్పీడ్ ఇంటర్నెట్ ని ఇస్తామని చెప్పారు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇటలీలోని అనేక పట్టణాలు జనాభా సమస్యను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల క్రితం ఇటలీలోని బాసిలికాటా ప్రాంతంలోని లారెంజానా పట్టణం ఎటువంటి డిపాజిట్లు లేకుండా గృహాలను € 1 (యూరో)కు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే.
Also Read: Kati Chakrasana: పొట్ట దగ్గర అధిక కొవ్వు తగ్గాలా.. ఈ యోగాసనాన్ని ట్రై చేయండి