Russia-Ukraine War: అమెరికాకు రష్యా ఆఫర్.. అగ్రరాజ్యం అంగీకరించేనా.. ఆసక్తిగా చూస్తున్న ప్రపంచం..

Russia-Ukraine War: మీ వాళ్లను అప్పగించాలంటే మా విక్టర్‌ బోట్‌ను వదిలేయండి.. ఇది అమెరికాకు రష్యా ఇచ్చిన ఆఫర్‌. మరి ఇంతకీ ఎవరీ విక్టర్‌? రష్యాకు ఎందుకంత ఇంపార్టెంట్?..

Russia-Ukraine War: అమెరికాకు రష్యా ఆఫర్.. అగ్రరాజ్యం అంగీకరించేనా.. ఆసక్తిగా చూస్తున్న ప్రపంచం..
Us Vs Russia
Follow us

|

Updated on: Aug 04, 2022 | 4:35 PM

Russia-Ukraine War: మీ వాళ్లను అప్పగించాలంటే మా విక్టర్‌ బోట్‌ను వదిలేయండి.. ఇది అమెరికాకు రష్యా ఇచ్చిన ఆఫర్‌. మరి ఇంతకీ ఎవరీ విక్టర్‌? రష్యాకు ఎందుకంత ఇంపార్టెంట్? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్‌‌తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా-అమెరికాల మధ్య సంబంధాలు దారుణ స్థితికి చేరుకున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తప్పుపడుతూ రష్యాపై అమెరికా ఆంక్షలను తీవ్రం చేసింది. దాంతో రష్యా తగ్గేదే లే అంటూ మరింత తీవ్రంగా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో.. రష్యా దగ్గర బంధీలుగా ఉన్న ఇద్దరు తమ అమెరికా పౌరుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు వీరిని విడిపించడం ఎలా అనే అంశంపై దృష్టి పెట్టింది అమెరికా. నాలుగు నెలల క్రితం అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ స్టార్‌ బ్రిట్నీ గ్రినెర్‌‌ను మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు రష్యా అధికారులు. అంతకు ముందు 2020లో అమెరికా మాజీ సైనికాధికారి పౌల్‌ వేలన్‌ను 2020లో గూఢచర్య నేరంపై అరెస్టు చేసింది రష్యా. ఇప్పుడు వీరిద్దరినీ రష్యా చెరనుంచి విడిపించి స్వదేశానికి భద్రంగా తీసుకురావడం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు పెద్ద సవాలుగా మారింది.

దీన్ని క్యాష్ చేసుకున్న రష్యా.. సరిగ్గా ఇక్కడే బేరం పెట్టింది. అమెరికా దగ్గర బందీగా ఉన్న విక్టర్‌ బోట్‌ను తమకు అప్పగిస్తే, మీ దేశస్తులను తీసుకోవచ్చని ప్రతిపాద పంపింది. దీంతో అసలు ఎవరీ విక్టర్‌బోట్‌ అనే చర్చ మొదలైంది.

ఎవరీ విక్టర్ బోట్.. తజఖిస్థాన్‌లో పుట్టిన 55 ఏళ్ల విక్టర్‌ బోట్‌.. గతంలో సోవియట్‌ సైన్యంలో ట్రాన్స్‌లేటర్‌గా పని చేశాడు. సోవియట్‌ పతనం తర్వాత ఆయుధాల డీలర్‌గా మారాడు. అతని నెట్‌వర్క్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఉగ్రవాదులకు కూడా ఆయుధాలను సరఫరా చేసేవాడు. 2008లో అమెరికా నిఘావర్గాలు ధాయిలాండ్‌లో విక్టర్‌ బౌట్‌‌ను అరెస్టు చేసింది. 2012లో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు. విక్టర్‌ బౌట్‌ జీవితం ఆధారంగా ‘లార్డ్‌ ఆఫ్‌ వార్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం కూడా వచ్చింది. అతన్ని మర్చంట్‌ ఆఫ్‌ డెత్‌ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

ఇలా విక్టర్ బౌట్‌ను అమెరికా నేరస్తుడు అంటుంటే.. రష్యా మాత్రం తమ దేశ వాణిజ్యవేత్త అని చెబుతుంది. అతన్ని తమకు అప్పగించాలని కోరుతోంది. విక్టర్‌ను వదిలేస్తే బ్రిట్నీ గ్రినెర్‌, పాల్‌ వేలన్‌ను అప్పగిస్తామని అమెరికాకు రష్యా ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే అమెరికా న్యాయ వ్యవస్థ మాత్రం విక్టర్‌ విడుదలకు మోకాలొడ్డుతున్నట్లు తెలుస్తోంది. అటు బైడెన్, ఇటు న్యాయవ్యవస్థ మధ్యలో ఫైనల్ నిర్ణయం ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం ఆసక్తి ఎదురు చూస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..