President Joe Biden: అమెరికా అధ్యక్షుడి స్వగ్రామంలో ఆగ్రహ జ్వాలలు.. ఉగ్రవాదిగా పోల్చుతూ సైన్ బోర్డులు..
తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడంతో అమెరికాలో కాకరేపుతోంది. ఇప్పుడు డెమొక్రాట్ అధ్యక్షుడు జో బైడెన్‌పై అక్కడి ప్రజలు మండి పడుతున్నారు.
తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడంతో అమెరికాలో కాకరేపుతోంది. ఇప్పుడు డెమొక్రాట్ అధ్యక్షుడు జో బైడెన్‌పై అక్కడి ప్రజలు మండి పడుతున్నారు. బిడెన్‌పై స్వయంగా ‘తాలిబాన్ ఉగ్రవాది’ అంటూ అభివర్ణిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయంగా అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో 20 సంవత్సరాల యుద్ధం ముగిసిందని ప్రకటించిన అధ్యక్షుడు బిడెన్ పరిస్థితి తలక్రిందులైంది. కేవలం ఒక సంవత్సరం క్రితం అతను ప్రజాదరణ, కొత్త కోణాలను టచ్ చేస్తూ దూసుకుపోయాడు. ఒక సంవత్సరం గడిచిందో లేదో అక్కడి ప్రజల విమర్శలకు అస్త్రంగా మారిపోయాడు. అంతేకాదు అక్కడి ప్రజలు ఇప్పుడు జో బైడెన్‌ని ఉగ్రవాదితో పోల్చుతున్నారు. అది ఎక్కడో కాదు స్వయంగా ఆయన స్వగ్రామంలో ఇలాటి పోస్టలర్లు ఏర్పాటు చేశారు. అక్కడి అతి పెద్ద సైన్ బోర్డుపై ఇలాంటివి ఇప్పడు అక్కడ కనిపిస్తున్నాయి. రాకెట్ లాంచర్ పట్టుకున్న తాలిబాన్ తీవ్రవాదిలా జో బైడెన్‌ను ప్రదర్శిస్తున్నారు.
జో బిడెన్, పెన్సిల్వేనియాలో జన్మించారు
జో బిడెన్ పెన్సిల్వేనియా రాష్ట్రంలో జన్మించారు. ఆయన స్వగ్రామంలో ఇలాంటి పరిస్థితిలో కనిపిస్తోంది. ఇక్కడి ప్రజల ఈ కోపంతో ఊగిపోతున్నారు. ఆ బోర్డ్‌లపై ‘తాలిబన్‌లను మళ్లీ గొప్పగా మార్చడం’ అని రాసి ఉంది. యుఎస్ మీడియా నివేదికల ప్రకారం పెన్సిల్వేనియా మాజీ సెనేటర్ స్కాట్ వాగ్నర్ బిల్‌బోర్డ్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాగ్నర్ ఎన్నికల నినాదాన్ని గుర్తు చేశారు
గత ఏడాది అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘మేకింగ్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే బిడెన్ నినాదాన్ని ‘తాలిబాన్లను మళ్లీ తిరిగి తీసుకొచ్చారు ‘ ప్రజలకు మీరు ఇచ్చిన సందేశం ఇదేనా అంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ బోర్డులు ఏర్పాటు చేసింది మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారు అని అనుకుంటే అది పెద్ద పొరపాటు.. వీటిని ఏర్పాటు చేసింది ఆయన పార్టీకి చెందిన వ్యక్తులు.
ట్రాంప్ చేసిన పొరపాటునే జో బైడెన్ చేస్తున్నాడని వారు విమర్శిస్తున్నారు. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అమెరికాలో ఒక సర్వే జరిగింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం ఈరోజు అమెరికాలో ఎన్నికలు జరిగితే ట్రంప్‌తో పోలిస్తే బిడెన్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సి రావచ్చని తేలింది.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.. సంచలన ట్వీట్ చేసిన గవర్నర్ తమిళసై..