14 సంవత్సరాల తర్వాత తల్లీబిడ్డలను కలిపిన ఫేస్‌బుక్..! ఆరేళ్ల వయసులో దూరమైన కూతురు..
Facebook: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వల్ల లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయి. కొంతమందికి ఈ వేదికలు ఎంతో ఆనందాన్ని
Facebook: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వల్ల లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయి. కొంతమందికి ఈ వేదికలు ఎంతో ఆనందాన్ని మిగులుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను కనెక్ట్ చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటి ద్వారా సంవత్సరాల క్రితం విడిపోయిన వ్యక్తులను కూడా కనుగొనవచ్చు. ఇది చాలా సంఘటనల ద్వారా నిరూపణ కూడా అయింది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఓ బ్యాడ్ తండ్రి కారణంగా విడిపోయిన తల్లి, కూతురు ఫేస్‌బుక్ వల్ల 14 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. కుమార్తె తన తల్లి నుంచి విడిపోయినప్పుడు ఆమె వయస్సు 6 సంవత్సరాలు.
ఒక నివేదిక ప్రకారం.. ఫ్లోరిడాకు చెందిన జాక్వెలిన్ హెర్నాండెజ్ సోషల్ మీడియా సాయంతో 14 సంవత్సరాల తర్వాత అమెరికా-మెక్సికో సరిహద్దులో తన తల్లి ఏంజెలికాను కలుసుకుంది. చాలా కాలం తర్వాత కలిసిన తల్లి కుమార్తెలు చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఆనందపడ్డారు. జాక్వెలిన్ ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రే ఆమెను కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
ఫేస్‌బుక్ సహాయంతో ఒక అమ్మాయి తనను సంప్రదించిందని ఆమె నా కోల్పోయిన కుమార్తె అని తల్లి ఏంజెలికా పోలీసులను సంప్రదించింది. ఏంజెలికా కంప్లెయింట్‌ను స్వీకరించిన పోలీసులు జాక్వెలిన్ గురించి వెతికారు. ఆమె జాడను తెలుసుకొని తల్లి కూతురుని కలిపేందుకు పథకం వేశారు. చివరకు 14 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి తన తల్లిని కలవగలిగింది. ప్రస్తుతం బాలికను కిడ్నాప్ చేసిన తండ్రి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అమెరికాలో ఫేస్‌బుక్ కారణంగా మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా 25 సంవత్సరాల తర్వాత కలుసుకోగలిగారు.