AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah tour: బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు.. నిర్మల్‌ చేరుకున్న అమిత్ షా

తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. నిర్మల్‌ జిల్లా రాంజీ గోండు స్మారక స్థూపం దగ్గర ఈ సభను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు ముఖ్య అతిథిగా హజరవుతున్నారు.

Amit Shah tour: బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు.. నిర్మల్‌ చేరుకున్న అమిత్ షా
Amit Shah
Balaraju Goud
|

Updated on: Sep 17, 2021 | 3:08 PM

Share

Amit Shah Nirmal Tour: తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. నిర్మల్‌ జిల్లా రాంజీ గోండు స్మారక స్థూపం దగ్గర ఈ సభను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన ప్రదేశంలోనే ఈ సభ నిర్వహిస్తూ సెంటిమెంటును రాబట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఈ సభకు అమిత్‌షాతోపాటు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరుకానున్నారు.

నిజాం నిరంకుశ పాలన కింద ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రం 1956తర్వాత మూడు ముక్కలైంది. ఓ భాగం మహారాష్ట్రలో కలవగా.. మరికొంత భాగం కర్నాటకలో కలిసింది. మిగిలినది ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతమైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విమోచన దినోత్సవం కాకుండా సెప్టెంబర్‌ 17ని విలీనం జరిగిన రోజుగా భావిస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజుని విమోచన దినోత్సవంగా జరుపుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం జరపకపోవడం దారుణమంటూ విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు.

నిర్మల్‌లో అమిత్‌షా సభ ద్వారా విమోచన దినోత్సవాన్ని భారీగా నిర్వహిస్తామన్నారు బీజేపీ నేతలు. రజాకార్ల అరాచకాలు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండు, కొమురం భీమ్‌ను స్మరిస్తూ ఈ సభ సాగబోతోందన్నారు. దాదాపు లక్షమంది తరలివచ్చేలా బీజేపీ సభకు ఏర్పాట్లు చేసింది. అమత్ షా మరికాసేపట్లో నిర్మల్‌కు చేరుకుంటారు. మోడీ బర్త్‌ డే సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు.

అటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం పాదయాత్రకు విరామం తీసుకుని సభలో పాల్గొననున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్న బీజేపీ తమ డిమాండ్‌ను ఈ సభ ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అమిత్‌షా తొలుత హైదరాబాద్‌ వచ్చి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని నిర్మల్‌ వెళ్లేలా ప్రణాళిక సిద్ధమైనా తరువాత షెడ్యూలు మారింది. ఆయన నాందేడ్‌కు విమానంలో వచ్చి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్‌ చేరుకుంటారు. ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర నాయకులు భారీ జనసమీకరణకు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని భైంసా, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే లక్ష మందిని రప్పించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. వర్షాలు, గాలులను తట్టుకునేలా మూడు సభావేదికలను సిద్ధం చేశారు. Read Also… PM Modi: ఉగ్రవాదం పెరగడానికి కారణం ఇదే.. SCO సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం