PM Modi: ఉగ్రవాదం పెరగడానికి కారణం ఇదే.. SCO సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం

షాంఘై సహకార సంస్థ(SCO) 20 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. SCOలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన

PM Modi: ఉగ్రవాదం పెరగడానికి కారణం ఇదే.. SCO సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం
PM Narendra Modi
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2021 | 3:55 PM

షాంఘై సహకార సంస్థ(SCO) 20 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. SCOలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్​కు కూడా స్వాగతం పలికారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న తీవ్ర‌వాదం ప్ర‌పంచ శాంతికి అతిపెద్దగా మారుతోందని ప్ర‌ధాని మోడీ అన్నారు. షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌ద‌స్సులో వ‌ర్చువ‌ల్ రీతిలో పాల్గొన్న ఆయ‌న స‌భ్య దేశాల‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇటీవ‌ల ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించిన తాలిబ‌న్ల అంశాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. తీవ్ర‌వాదుల ఆగ‌డాల వ‌ల్ల ప్ర‌పంచ శాంతి దెబ్బ‌తింటోంద‌న్నని అన్నారు. ప్రాంతీయ స్థిర‌త్వంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ్రూపులోని స‌భ్యులంతా కనెక్టివిటీ, న‌మ్మ‌కం లాంటి అంశాల‌పై ప‌ర‌స్ప‌రం ప‌నిచేయాల‌న్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు అని.. అక్క‌డ రాడిక‌లైజేష‌న్‌, తీవ్ర‌వాదం పెర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త‌ను SCO స‌భ్య దేశాలపై ఉందన్నారు.

సెంట్ర‌ల్ ఏషియా చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే, అక్క‌డ ప్ర‌గ‌తిశీల సంస్కృతులు, విలువలు స‌మ్మిళితం అయ్యాయ‌న్నారు. కొన్ని శ‌తాబ్ధాల పాటు సూఫిజం ఇక్క‌డ వ‌ర్ధిల్లింద‌న్నారు. ఆసియా ప్రాంత‌మంతా అది వ్యాపించింద‌ని, ఇక్క‌డ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ ప‌ద్ధ‌తుల‌ను చూడ‌వ‌చ్చు అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

సెంట్ర‌ల్ ఏషియాలో ఉన్న చారిత్ర‌క వార‌స‌త్వాన్ని ప‌రిశీలిస్తే, ఎస్సీవో స‌భ్యదేశాలు తీవ్ర‌వాదంపై క‌లిసి పోరోడాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో స‌భ్య‌దేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం క‌లిగి ఉన్న ఎన్నో ఇన్స్‌టిట్యూష‌న్లు ఉన్న‌ట్లు ప్రధాని మోడీ తెలిపారు. షాంఘై స‌హ‌కార సంస్థ 2001లో ఏర్పాటైంది. క‌జ‌కిస్తాన్‌, చైనా, కిర్గిస్తాన్‌, ర‌ష్యా, త‌జికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఇండియా, పాకిస్థాన్‌, ఇరాన్ స‌భ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాల‌ను, ప‌ర‌స్ప‌ర విశ్వాసాన్ని పెంచుకోవాల‌న్న ల‌క్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి: Cooking Oil: మీరు వాడే వంట నూనె మంచిదేనా.. మీ అనారోగ్యం వెనుక ఫేక్ ఆయిల్ ఉందంటే నమ్ముతారా.. అవును.. ఇది నిజం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?