Coronavirus: జింకకు కరోనా వైరస్.. తొలి కేసు ఆ దేశంలోనే నమోదు.. వ్యవసాయ శాఖ వెల్లడి..!

Coronavirus: గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు సోకిన కరోనా వైరస్ తాజాగా జింకకు కూడా వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి..

Coronavirus: జింకకు కరోనా వైరస్.. తొలి కేసు ఆ దేశంలోనే నమోదు.. వ్యవసాయ శాఖ వెల్లడి..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 28, 2021 | 8:07 PM

Coronavirus: గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు సోకిన కరోనా వైరస్ తాజాగా జింకకు కూడా వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు. మనుషుల ద్వారా, లేదా జంతు జాతుల ద్వారా జింకకు కరోనా సోకి ఉంటుందని తాము అనుమానిస్తున్నట్లు వైద్యనిపుణులు తెలిపారు.

అయితే గతంలో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన జంతువులకు కరోనా సోకిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ వైద్యనిపుణులు ఒహియోలోని జింకల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా, ఓ జింకకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబోరేటరీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

కాగా, ఇప్పటికే మనుషులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. గత ఏడాదికిపైగా ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌.. ఇప్పుడిప్పుడు అదుపులోకి వచ్చింది. ఇక జంతువులకు కూడా సోకవడం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చాలా జంతువులు ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డాయి.

ఇవీ కూడా చదవండి:

India Corona cases: ఇండియాలో టెన్షన్ పెడుతోన్న కొత్త కేసులు.. ప్రమాదకరంగా మరణాల సంఖ్య

Vaccination : ఒక్క రోజే రికార్డు స్థాయి వ్యాక్సినేషన్.. అభినందనలు తెలిపిన మోడీ