India Corona cases: ఇండియాలో టెన్షన్ పెడుతోన్న కొత్త కేసులు.. ప్రమాదకరంగా మరణాల సంఖ్య

ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు కూడా 40వేలు దాటింది. కొత్తగా...

India Corona cases: ఇండియాలో టెన్షన్ పెడుతోన్న కొత్త కేసులు.. ప్రమాదకరంగా మరణాల సంఖ్య
India Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 28, 2021 | 10:14 AM

ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు కూడా 40వేలు దాటింది. కొత్తగా 46,759 మంది వైరస్ సోకినట్లు తేలింది. మరో 509మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. కొత్తగా 31,374 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,26,49,947
  • మొత్తం మరణాలు: 4,37,370
  • మొత్తం కోలుకున్నవారు: 3,18,52,802
  • యాక్టివ్ కేసులు: 3,59,775

వ్యాక్సినేషన్ విషయంలో రికార్డ్…

కొవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ అరుదైన మైలురాయిని అందుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే కోటి డోసులకు పైగా పంపిణీ చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి కావడం దేశవ్యాప్తంగా రికార్డు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజే కోటి డోసులకు పైగా పంపిణీ చేసి రికార్డు నెలకొల్పడంపై హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం నుండి.. రాత్రి 10గంటల వరకు దేశ వ్యాప్తంగా 1,00,64,032 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ జరిగినట్టు కొవిన్‌ పోర్టల్‌లో రికార్డులు నమోదైయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 62.09 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.05 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. 18-44 ఏళ్ల వారిలో 23,72,15,353 మంది ఫస్ట్ డోసు, 2,45,60,807 మంది సెకండ్ డోసు తీసుకున్నట్లు వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర మరోసారి సృష్టం చేసింది. ప్రస్తుతానికి కొవీషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని మార్చే అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ పనితీరుపై ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామన్నారు. రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు పంపిణి చేయడం.. కొత్తేమీకాదన్నారు. వ్యాక్సిన్లపై వచ్చిన అపోహలను తొలగించేందుకు ప్రంట్ లైన్ వర్కర్లతో పాటు ఆశా వర్కర్లు చాలా అవగాహన కల్పించారని అధికారులు తెలిపారు. దీంతో ఈ స్థాయిలో వ్యాక్సిన్లు పంపిణీ చేయగలిగామన్నారు. ఇంకా మున్ముందు ఈ సంఖ్యను కూడా దాటుతామని అధికారులు చెబుతున్నారు.

Also Read: నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద క్రేజీ సీన్.. ప్రేమించి, పెళ్లాడిన యువతి కోసం సినిమా స్టైల్లో