Kakinada: కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద క్రేజీ సీన్… ప్రేమించి, పెళ్లాడిన యువతి కోసం సినిమా స్టైల్లో

గారాబంగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకు...

Kakinada: కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద క్రేజీ సీన్... ప్రేమించి, పెళ్లాడిన యువతి కోసం సినిమా స్టైల్లో
Cinima Style
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 28, 2021 | 11:02 AM

గారాబంగా పెంచుకున్న కూతురు తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువతి.. కాకినాడ యువకుడిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటను అడ్డుకోబోయారు యువతి తల్లిదండ్రులు. దీంతో వారిని పక్కకు తప్పించి ఆ యువతిని సినిమా రేంజ్‌లో అక్కడి నుంచి తీసుకెళ్లాడు ఆ యువకుడు. ఈ ఘటన కాకినాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం దగ్గర చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకుడు, కాకినాడకు చెందిన యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు 40 రోజుల క్రితం వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్నారు. శుక్రవారం వివాహం చేసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని.. ఆమెను తమతో రావాలంటూ బతిమిలాడారు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన యువకుడు యువతిని కార్యాలయం గేటు బయటకు తీసుకువచ్చాడు. అప్పటికే అక్కడ కారుతో అతడి స్నేహితులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే యువతిని కారులోకి ఎక్కించి, తానూ కదులుతున్న వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు యువకుడు. వెంటనే తేరుకున్న యువతి తల్లిదండ్రులు కారును వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. నవమాసాలు మోసి పెంచామని, అయితే అవన్నీ మరచిపోయి మమ్మల్ని ఇలా మోసం చేస్తావా అంటూ ఆ యువతి పేరెంట్స్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ యువకుడి కంటే యువతి వయసులో ఒక సంవత్సరం పెద్దదని తెలుస్తోంది. ఏది ఏమైనా కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం దగ్గర సినిమా రేంజ్‌లో సీన్‌ కళ్ల ముందు కనిపించింది.

Also Read: నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

 ఏపీలో క్యాన్ బీర్ విక్రయానికి ప్రభుత్వం అనుమతి.. 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్