AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి

నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెండ్లి వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా...

Accident: నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నవ వధువు, ఆమె తండ్రి స్పాట్‌లోనే మృతి
Bride Dead In Accident
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2021 | 10:07 AM

Share

నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెండ్లి వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక, ఆమె తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు.  పెండ్లి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర బల్లర్షాలోని రాజురాకు రిసెప్షన్‌ కోసం వెళ్లి వస్తుండగా.. ఈ యాక్సిడెంట్  జరిగింది.  మరో 10 నిమిషాలలో ఇళ్లు చేరుకుంటామనే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం  పాండవ పూర్ బిడ్జిని ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లింట ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది.

చౌటుప్పల్‌లో దారుణం.. పల్సర్‌ బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ముగ్గురు యువకులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతోన్న పల్సర్‌ బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో మృతి చెందిన వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ చిల్ల చిట్యాల మండలంలోని పిట్టంపల్లికి చెందిన హరీశ్‌తో పాటు మరో ఇద్దరు యువకులు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. హరీశ్‌ స్వగ్రామంలో వివాహం ఉండడంతో వీరు ముగ్గురు బైక్‌పై వచ్చారు. వివాహం పూర్తి అయిన తర్వాత శనివారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో పిట్టంపల్లి నుంచి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఈ క్రమంలోనే వీరు ముగ్గురు ధర్మోజీగూడెం చేరుకునే సరికి.. అక్కడ ఉన్న ఓ వేబ్రిడ్జి వద్ద రివర్స్‌ గేర్‌లో వస్తోన్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ ఒక్కసారిగా కిందపడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ముగ్గురు యువకులు అప్పటికే మరణించారు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Also Read: ఏపీలో క్యాన్ బీర్ విక్రయానికి ప్రభుత్వం అనుమతి.. 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్

అమెరికా పవర్ కౌంటర్.. అఫ్గా‌న్‌లోని ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిపై వైమానిక దాడి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల