కోవిడ్-19 పుట్టుకపై సమాచారాన్ని తొక్కిపెడుతున్న చైనా..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం
కోవిడ్-19 మూలాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఇంకా తొక్కిపెడుతూనే ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ఈ మహమ్మారి విస్తరిస్తూనే ఉందని ఆయన చెప్పారు.
కోవిడ్-19 మూలాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఇంకా తొక్కిపెడుతూనే ఉందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ఈ మహమ్మారి విస్తరిస్తూనే ఉందని ఆయన చెప్పారు. ఈ కరోనా వైరస్ బయో వెపన్ అని తాము నమ్మడంలేదని, అయితే ఇది చైనా ల్యాబ్ నుంచి తలెత్తిందా లేక కావాలనే లీక్ చేశారా అన్న విషయమై చెప్పలేమని యూఎస్ ఇంటెలిజెన్స్ సంస్థలు రకరకాల ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా బైడెన్..దీనిపై తీవ్రంగా స్పందించారు. కోవిడ్ పుట్టుకకు సంబంధించి చైనా వద్ద కీలక సమాచారం ఉందని.. కానీ దీని గురించి తెలియజేసేందుకు ఆ దేశం నిరాకరిస్తోందని ఆయన అన్నారు. పైగా అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని చైనా అధికారులు మొదటినుంచీ అడ్డుకుంటూనే ఉన్నారన్నారు. ఈ రోజు వరకు కూడానా ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే గాక..వివిధ దేశాల నుంచి అందుతున్న కాల్స్ ను కూడా తిరస్కరిస్తోందని ఆయన చెప్పారు. అనేక దేశాల్లో ఈ వైరస్ విస్తరిస్తూనే ఉందన్నారు.
ఏది ఏమైనా మరింత సమాచారాన్ని బీజింగ్ షేర్ చేసుకోవడానికి అనువుగా ఆ దేశంపై ఒత్తిడి తేవడానికి మిత్ర దేశాలతో కలిసి తాము ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ఈ విషయంలో ఒప్పిస్తామన్నారు. ఈ గ్లోబల్ ట్రాజెడీపై మాకు పూర్తి సమాచారం కావాలి.. అదే మేం గట్టిగా కోరుతున్నాం అని జోబైడెన్ వ్యాఖ్యానించారు. గత జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం వూహాన్ లోని ల్యాబ్ ను విజిట్ చేసినప్పటికీ.. అక్కడి రీసెర్చర్లు మనస్ఫూరిగా సహకరించని కారణంగా వారు కీలక సమాచారాన్ని తెలుసుకోలేకపోయారు. పైగా వారి నివేదిక సమగ్రంగా లేదన్న విమర్శలను ఎదుర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..! నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..:Prakash Raj Remarried Video.
వామ్మో..స్కూటీ డిక్కీలో నాగుపాము..! ఎలా వచ్చిందో తెలిసా..?షాక్ లో ఓనర్..:Snake Viral Video.
నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.