Viral News: దగదగ మెరిసిపోతూ పొడవాటి వింత చేప.. సముద్రతీరంలో చూసి షాకైన జనం
Rare Fish: అమెరికాలోని కరోలిన్ తీరంలో అరుదైన ఓ పొడవాటి చేప దర్శనమిచ్చింది. సముద్రం నుంచి కొట్టుకొచ్చి తీరంలో పడి ఉండగా.. ఉదయాన అటువైపు వెళ్లిన స్థానికులు దీన్ని చూసి షాక్ అయ్యారు.
అమెరికాలోని కరోలిన్ తీరంలో ఓ పొడవాటి వింత చేప దర్శనమిచ్చింది. సముద్రం నుంచి కొట్టుకొచ్చి తీరంలో పడి ఉండగా.. ఉదయాన అటువైపు వెళ్లిన స్థానికులు దీన్ని చూసి షాక్‌కు గురైయ్యారు. ఈ చేప దాదాపు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల పొడవున్నట్లు స్థానికులు తెలిపారు. తీరంలో కనిపించినప్పటికే అది చనిపోయి ఉన్నట్లు చెప్పారు. మునుపెన్నడూ ఇలాంటి వింత చేపను తాము చూడలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్థానికుడైన ఓ వ్యక్తి ఈ వింత చేపను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. సముద్రం నుంచి కొట్టుకొచ్చి ఇది తీరంలో పడి ఉన్నట్లు తెలిపిన స్థానికుడు.. సూర్యుడి వెలుగుతో వెండి రంగులో ఇది దగదగ మెరిసిపోతున్నట్లు చెప్పారు.
ఈ అరుదైన చేపను తన ఇంటికి తీసుకెళ్లి.. ఇది ఏ రకం చేపో తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతికి చూసినట్లు ఆ స్థానికుడు సోషల్ మీడియాలో తెలిపాడు. ఇది అరుదైన ఫ్రోస్ట్‌షిఫ్‌గా తన తాత తెలిపినట్లు వెల్లడించారు. ఈ అరుదైన చేపలు కాస్త వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఆత్మహత్య చేసుకునే తరహాలో సముద్ర జలాల నుంచి తీరానికి కొట్టుకొచ్చి చనిపోతుంటాయి.
కరోలిన్ సముద్రతీరంలో వింత చేప దర్శనమివ్వడం అమెరికా మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. సహజంగా న్యూజిలాండ్ సమీప ప్రాంతాల్లో సముద్రం లోపల ఇవి దర్శనమిస్తాయట. సముద్ర గర్భంలో లోతున ఉండే ఇవి జాలర్ల వలలో చాలా అరుదుగానే చిక్కుతుంటాయని మీడియా వర్గాలు తెలిపాయి.
Also Read..
వధూవరుల క్రేజీ పుషప్స్.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో!
సొంత ఆటోను నడిరోడ్డుపై దగ్ధం చేసిన డ్రైవర్.. అందుకేనంటూ హల్‌చల్