Viral Video: వధూవరుల క్రేజీ పుషప్స్‌‌.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లిలో వధూవరుల క్రేజీ అల్లరి అతిధులను ఆకట్టుకుంటుంది..

Viral Video: వధూవరుల క్రేజీ పుషప్స్‌‌.. వావ్ అంటున్న నెటిజన్లు.. వైరల్ అవుతున్న వీడియో!
Wedding Video
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 28, 2021 | 3:31 PM

పెళ్లంటేనే సందడి.. వధూవరులను రెడీ చేయడం.. కుటుంబసభ్యుల హడావుడి.. చిన్నపిల్లల ఆటలు.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ సైగలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా పెళ్లిలో సర్వసాధారణం. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ప్రతీ జంట.. వివాహంలో జరిగే మూమెంట్స్‌ను క్యాప్చర్ చేసుకుంటారు. సరిగ్గా ఇలాగే ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. పెళ్లి మండపాన్ని జిమ్‌గా మార్చిన ఈ జంట.. వేదికపైనే వర్కౌట్స్ చేసి అతిధులను ఆశ్చర్యపరిచారు.

పెళ్లి వేదికపైన.. అది కూడా పెళ్లి దుస్తుల్లో వధూవరులిద్దరూ పుషప్స్‌ చేశారు. ఇద్దరూ కూడా పుషప్స్‌ పర్ఫెక్ట్‌గా చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ కొత్త జంట ఎవరో కాదు.. ఇద్దరూ ఫిట్‌నెస్ కోచ్‌లు. వధువు అరోరా.. వరుడు ఆదిత్య మహాజన్. వీరి పెళ్లి ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. వధువు అరోరా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ”కలిసి ఎత్తే జంట చివరికి వివాహంతో ఒకటైంది” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే.. వధువు అరోరా 8 కిలోల లెహంగాతో పుషప్స్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి..

ఇవి చదవండి: