Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమే.. ఏపీ డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమన్నారు.
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా తనకు కూడా ఇష్టమన్నారు. అయితే రాజకీయాల్లో కంటే నటనలోనే పవన్ కల్యాణ్ గొప్పవాడని అభిప్రాయపడ్డారు. ఆయన సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ చేసుకుంటే మంచిదన్నారు. రాజకీయాలకు పవన్ పనికిరారని.. ఆయన రాజకీయాలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్.. జగన్‌తో పోల్చుకోవడం మానుకోవాలన్నారు. అలాగే సీఎం జగన్‌ను విమర్శించే ముందే పవన్ కల్యాణ్, నారా లోకేష్ విజ్ఞతతో ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నగరంలో చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జగన్‌కు ఎవరూ పోటీలేరన్న డిప్యూటీ సీఎం ధర్మాన.. జగన్‌కు జగనే సాటి అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జగన్ తిరిగారని.. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఆయనకు ఉందన్నారు. జగన్ ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
కోవిడ్ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే నకిలీ స్టాంపుల కుంభకోణం జరిగిందని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలను ఏపీ ప్రభుత్వం వదులుకోబోదని స్పష్టంచేశారు. నదీ వాటల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను వదులుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.
Also Read..
నిటారు కొండపై మంచు చిరుతల వేట.. ఈ అద్భుతమైన వీడియోను చూస్తే ఆశ్చర్యపోతారంటే!
చౌటుప్పల్‌లో దారుణం.. పల్సర్ బైక్‌ను ఢీకొట్టిన లారీ.. అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ముగ్గురు యువకులు.