AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనోషాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రం కెనోషాలో రెండోరోజు కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఆఫ్రో-అమెరికన్‌ జాకబ్‌ బ్లేక్‌ (29)పై పోలీసుల కాల్పుల ఘటనను నిరసిస్తూ వందలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చి నిరసనలు తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని నిప్పుబెట్టారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

కెనోషాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
Balaraju Goud
|

Updated on: Aug 26, 2020 | 4:46 PM

Share

అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రం కెనోషాలో రెండోరోజు కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఆఫ్రో-అమెరికన్‌ జాకబ్‌ బ్లేక్‌ (29)పై పోలీసుల కాల్పుల ఘటనను నిరసిస్తూ వందలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చి నిరసనలు తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని నిప్పుబెట్టారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కొందరు న్యాయస్థానం భవనంపైకి సీసాలు, బాణసంచా బాంబులు విసిరారు. ఆందోళనకారులను నివారించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాకబ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆందోళనలు చల్లారకపోవడంతో నేషనల్‌ గార్డ్‌ సభ్యులు 125 మందినిగవర్నర్‌ పిలిపించారు. ఈ ఘటనతో సంబంధమున్న అధికారులను బాధ్యులను చేయాలని డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, ఆదివారం సాయంత్రం రహదారి పక్కన నిలిపి ఉంచిన కారులోకి వెళుతున్న బ్లేక్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆయన ముగ్గురు పిల్లలు వాహనంలోనే ఉన్నారు. తన కుమారుడి నడుము నుంచి కిందకు ఎడమవైపున్న భాగమంతా చచ్చుబడి పోయిందని జాకబ్‌ బ్లేక్‌ తండ్రి చెప్పారు. ఉత్తర కరోలినాలో ఉండే ఆయన కుమారుడిని చూసేందుకు వచ్చిన ఆయన షికాగో సన్‌-టైమ్స్‌తో మాట్లాడారు. తన కుమారుడి శరీరంపై ఎనిమిది తూటా గాయాలు ఉన్నాయని వెల్లడించారు.