AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి, భార్య గొంతు కోసిన భారత మాజీ షాట్ ఫుట్ ఆటగాడు

భారత మాజీ షాట్ ఫుట్ పతక విజేత ఇక్బాల్ సింగ్ ను అమెరిక‌న్ పోలీసులు అరెస్ట్ చేశారు. త‌ల్లి, భార్య‌ను హ‌త్య చేసిన నేరంలో పోలీసులు సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తల్లి, భార్య గొంతు కోసిన భారత మాజీ షాట్ ఫుట్ ఆటగాడు
Balaraju Goud
|

Updated on: Aug 26, 2020 | 3:26 PM

Share

భారత మాజీ షాట్ ఫుట్ పతక విజేత ఇక్బాల్ సింగ్ ను అమెరిక‌న్ పోలీసులు అరెస్ట్ చేశారు. త‌ల్లి, భార్య‌ను హ‌త్య చేసిన నేరంలో పోలీసులు సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెన్సిల్వేనియాలోని డెలావేర్ కౌంటీలో ఉండే అత‌ను ఆదివారం పోలీసుల‌కు ఫోన్ చేసి తాను త‌న త‌ల్లి, భార్య‌ను హ‌త్య చేసిన‌ట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అత‌ని ఇంటికి వెళ్లి చూడ‌గా సింగ్ ఒంటిపై గాయాలు, ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో క‌నిపించాడు. ఇంట్లో భార్య జస్పాల్ కౌర్, త‌ల్లి నసీబ్ కౌర్ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నారు. అమెరికాలోని డెలావేర్ కౌంటీలో నివాసముంటున్న ఇక్బాల్ సింగ్ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, చిన్నపాటి వివాదంతో భార్య జస్పాల్ కౌర్, త‌ల్లి నసీబ్ కౌర్ లను కత్తితో గొంతుకోసి హతమార్చాడు ఇక్బాల్ సింగ్. ఇంట్లో పెనుగులాటలో ఇక్బాల్ కు కూడా గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

నిందితుడి ఫోన్ కాల్ తో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్ద‌రినీ అత‌ను గొంతుకోసి హ‌త‌మార్చిన‌ట్లు గుర్తించారు. వెంట‌నే సింగ్‌ను అదుపులోకి తీసుకుని అత‌ని ఒంటిపై గాయాలు ఉండ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, సింగ్ 1983లో భార‌త్ త‌ర‌ఫున‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచారు.

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో