రైతుల అరెస్టు సరికాదు..

రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతుల అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు...

రైతుల అరెస్టు సరికాదు..
Sanjay Kasula

|

Aug 26, 2020 | 9:33 PM

Janasena Chief Pawan Kalyan  : రాజధాని ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతుల అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయమన్నారు. తక్షణమే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ మేరకు జనసేనాని ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకి ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని కోరారు.  ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించిందని ఆయన గుర్తు చేశారు.

వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపులో జాప్యం చేస్తూ ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసిందని విమర్శించారు. 28వేల మందికిపైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సకాలంలో కౌలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu