AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Story: అమెరికా..ఇమ్మిగ్రేషన్ రూల్స్ పై కాలేజీల లీగల్ పోరాటం…అయితే ?

అమెరికాలో కాలేజీలు, యూనివర్సిటీలు ప్రస్తుతం అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసి విదేశీ విద్యార్థులను దేశం వదిలి వెళ్ళమన్నట్టు హెచ్ఛరించడంతో.. ఆ రూల్స్ ని సవాలు చేస్తూ..

Big Story: అమెరికా..ఇమ్మిగ్రేషన్ రూల్స్ పై కాలేజీల లీగల్ పోరాటం...అయితే ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 20, 2020 | 5:04 PM

Share

అమెరికాలో కాలేజీలు, యూనివర్సిటీలు ప్రస్తుతం అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసి విదేశీ విద్యార్థులను దేశం వదిలి వెళ్ళమన్నట్టు హెచ్ఛరించడంతో.. ఆ రూల్స్ ని సవాలు చేస్తూ ఈ విద్యాసంస్థలు కోర్టుకెక్కాయి. ఈ లీగల్ పోరులో ఇవి విజయం సాధించినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కాలర్స్ ఉన్న దేశంగా అమెరికాకు గల ప్రతిష్ట (రెప్యుటేషన్) ని తాము ఒకవిధంగా కోల్పోతున్నట్టే అని ఇవి భావిస్తున్నాయి. యూనివర్సిటీల అధ్యాపకులు దీన్ని ‘స్టెడీ ఎరోషన్’ (హరించుకుపోతున్న పరిణామం) గా పేర్కొంటున్నారు. దేశంలో విదేశీ విద్యార్థులకు స్థానం లేదన్నట్టు ట్రంప్ సర్కార్ అదేపనిగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సవరిస్తుండడం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు కొరకరాని కొయ్యగా మారింది.

2016 లో ట్రంప్ దేశాధ్యక్షునిగా ఎన్నికయినప్పటి నుంచి అమెరికాకు వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏ ఏటికాయేడు సుమారు పది శాతం వరకు తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ పాండమిక్ కారణంగా వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వేలాది మంది విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాలసీలు చకచకా మారిపోతున్నకొద్దీ విదేశీ స్టూడెంట్స్ పరిస్థితి డోలాయమానంగా మారిందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఛాన్సలర్ కిమ్ విల్ కాక్స్ అభిప్రాయపడ్డారు.

దేశంలో ఇప్పటికీ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలు గలదిగా పాపులర్ అవుతున్నా.. ఇప్పుడిది అన్ని రిస్క్ లను ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు. అటు-ఆన్ లైన్ లోను, విద్యార్థుల వ్యక్తిగత హాజరీతోను నడుస్తున్న కొన్ని కళాశాలలు…ముఖ్యంగా విదేశీ విద్యార్థులను అనుమతించకూడదనే ప్రభుత్వ ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. లీగల్ గా రూల్స్ పై పోరాటం సాధించామన్న తృప్తి వీటికి లేకుండాపోయింది.