‘మాస్క్ ధరించా..కరోనాపై మళ్ళీ మీడియాకు బ్రీఫింగ్ లు ఇస్తా’..ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారికి తలొగ్గక తప్పలేదు. ఎందుకైనా మంచిదని ముఖానికి తిరిగి నల్లటి మాస్క్ ధరించి కనబడ్డారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడానికి మరో 100 రోజులు మాత్రమే ఉండడంతో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారికి తలొగ్గక తప్పలేదు. ఎందుకైనా మంచిదని ముఖానికి తిరిగి నల్లటి మాస్క్ ధరించి కనబడ్డారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడానికి మరో 100 రోజులు మాత్రమే ఉండడంతో ఆయన తీరు మారింది. నన్ను మించిన దేశభక్తుడు ఎవరూ లేరని చాటుకుంటున్నారు. కోవిడ్-19 పై ఆయన గడియకో మాట మారుస్తుండడంతో అమెరికన్లలో ఆయన పట్ల నిరసన పెరిగిపోతోంది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండడానికి ఈ అధ్యక్షులవారే కారణమని చాలామంది ఈసడించుకుంటున్నారు. దీంతో ఆయన ‘రివర్స్’ లోకి వచ్చారు. సామాజిక దూరాన్ని పాటించలేనప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం దేశభక్తికి సూచన అని అనేకమంది అంటుంటారని ట్వీట్ చేశారు. ‘మంగళవారం నుంచి రెగ్యులర్ గా కరోనా వైరస్ పై మీడియాకు బ్రీఫింగ్ లు ఇస్తుంటా….మీతో టచ్ లో ఉంటా’ అంటూ జర్నలిస్టులకు ‘స్నేహ హస్తాన్ని’ చాటుతున్నారు.