AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా నిన్న 2,03,988 మందికి కోవిడ్ సోకడంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,48,44,324కి చేరుకుంది. కాగా కరోనాతో సోమవారం ఒక్క రోజే ఏకంగా 4 వేల మంది మరణించారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 6,08,508 చేరింది. ఇక ప్రస్తుతం 53,35,188 యాక్టీవ్ కేసులు ఉండగా..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2020 | 10:55 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నిన్న 2,03,988 మందికి కోవిడ్ సోకడంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,48,44,324కి చేరుకుంది. కాగా కరోనాతో సోమవారం ఒక్క రోజే ఏకంగా 4 వేల మంది మరణించారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 6,08,508 చేరింది. ఇక ప్రస్తుతం 53,35,188 యాక్టీవ్ కేసులు ఉండగా, 88,96,440 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 62,016 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 39,60,566కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,43,792 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,171కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,02,529 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 7,24,578 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 587 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 28,084 మంది మరణించారు.

Read More:

ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..

ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..

Follow Us
అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. బాబూ మోహన్..
అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. బాబూ మోహన్..
చేప ముళ్లు తినొచ్చా? అది కడుపులోకి వెళితే ప్రమాదమా?
చేప ముళ్లు తినొచ్చా? అది కడుపులోకి వెళితే ప్రమాదమా?
మామిడి ఒరుగులు ఇలా తయారు చేసుకోండి.. భలే ఉంటాయ్..
మామిడి ఒరుగులు ఇలా తయారు చేసుకోండి.. భలే ఉంటాయ్..
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? 34 ఏళ్లకే ఎలా చనిపోయాడో తెలుసా?
'అభి' సినిమా హీరో గుర్తున్నాడా? 34 ఏళ్లకే ఎలా చనిపోయాడో తెలుసా?
మధ్యాహ్నం కునుకు తీసే ముందు ఇది తెలుసుకోండి.ఈ సమయం దాటితే ప్రమాదం
మధ్యాహ్నం కునుకు తీసే ముందు ఇది తెలుసుకోండి.ఈ సమయం దాటితే ప్రమాదం
తెల్లసొన vs పచ్చసొన.. గుడ్డులో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది..?
తెల్లసొన vs పచ్చసొన.. గుడ్డులో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఏంటీ పిచ్చి రాతలు అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..
ఏంటీ పిచ్చి రాతలు అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే అవాక్కే..
టూర్‌ వెళ్లి ఇంటికొచ్చిన ఫ్యామిలీ.. కార్ రూఫ్ బాక్స్ ఓపెన్ చేయగా
టూర్‌ వెళ్లి ఇంటికొచ్చిన ఫ్యామిలీ.. కార్ రూఫ్ బాక్స్ ఓపెన్ చేయగా
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..
కూరగాయల్లో కంటికి కనిపించని పురుగులు,వండే ముందు ఇలా క్లీన్ చేయండి
కూరగాయల్లో కంటికి కనిపించని పురుగులు,వండే ముందు ఇలా క్లీన్ చేయండి