ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

టీడీపీ కీలక నేత, విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖ పట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ తరుపున కురుపాంలో నామినేషన్..

  • Tv9 Telugu
  • Publish Date - 8:59 am, Tue, 21 July 20

టీడీపీ కీలక నేత, విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖ పట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ తరుపున కురుపాంలో నామినేషన్ వేశారు థాట్రాజ్. అయితే కుల వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఆయన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇక జనార్థన్ కాంగ్రెస్ నుండి కురుపాం ఎమ్మెల్యేలా 2009లో గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీడీపీలో చేరారు. కాగా సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజుకు జనార్థన్ థాట్రాజ్ స్వయానా మేనల్లుడు. జనార్థన్ థాట్రాజ్ మరణంతో కురుపాంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. కాగా మాజీ ఎమ్మెల్యే జనార్థన్ మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read More: 

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..

బ్రేకింగ్: మధ్య ప్రదేశ్ గవర్నర్ మృతి..