AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biden Government: అమెరికాలో మెరిసిన మరో తెలుగు తేజం.. కీలక పదవికి తెలుగు సంతతి మహిళ నామినేట్

అమెరికాలో మరో తెలుగు తేజం వెలిగింది. దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్న జో బైడెన్ తాజాగా మరో తెలుగు తేజానికి ఉన్నత..

Biden Government: అమెరికాలో మెరిసిన మరో తెలుగు తేజం.. కీలక పదవికి తెలుగు సంతతి మహిళ నామినేట్
America
Rajesh Sharma
|

Updated on: Mar 31, 2021 | 2:15 PM

Share

Biden government nominated Telugu women as Judge: అమెరికాలో మరో తెలుగు తేజం వెలిగింది. దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారతీయ సంతతికి పెద్ద పీట వేస్తున్న జో బైడెన్ తాజాగా మరో తెలుగు తేజానికి ఉన్నత పదవినిచ్చారు. వాషింగ్టన్ జిల్లా జడ్జిగా ఓ తెలుగు సంతతికి చెందిన మహిళను అమెరికా అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. మొత్తం పదకొండు మంది జడ్జిలను నామినేట్ చేసిన బైడెన్ అందులో తెలుగు సంతతికి చెందిన ఓ మహిళకు అవకాశం కల్పించారు. ఇందులో ఓ పాకిస్తానీ సంతతి మహిళ కూడా వుండడం విశేషం.

రూపా రంగా పుట్టగుంట. అమెరికాలో సెటిలైన తెలుగు కుటుంబ వారసురాలు. ఇపుడామెకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ఉన్నత అవకాశం కల్పించారు. దీంతో అమెరికాలో మరో తెలుగు మహిళకు కీలక పదవి లభించినట్లయింది. ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులిచ్చారు బైడెన్. అందులో చాలా మంది మహిళలకు కూడా వుండడం విశేషం. తాజాగా వాషింగ్టన్‌ డీసీలోని జిల్లా కోర్టు న్యాయమూర్తి పదవికి రూపా రంగా పుట్టగుంటను జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనకు సెనెట్ ఆమోదం తెలపడం ఇక లాంఛనమే. మొత్తం 11 జడ్జి పోస్టులకు న్యాయ నిపుణుల పేర్లను బైడెన్‌ ప్రతిపాదించారు. ఇందులో రూపా రంగా పుట్టగుంట పేరుంది.

డిస్ట్రిక్ట్ ఆఫ్ డీసీ న్యాయమూర్తిగా ఎంపిక కానున్న తొలి ఏషియన్ ఆమెరికన్‌గా రూపా రంగా నిలవబోతున్నారు. గత రెండున్నర ఏళ్లుగా రెంటల్ హౌసింగ్ కమిషన్ జడ్జిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2013-19 వరకు న్యాయవాదిగా ఉంటూ క్రిమినల్ కేసులను వాదించారు రూపా రంగా. గృహహింసకు సంబంధించిన కేసుల్లో స్వచ్ఛంద న్యాయ సహాయాన్ని అందిస్తూ పేరుగాంచారామె. 2013లో డీసీ సుపీరియర్ కోర్టు జడ్జి విలియం జాక్సన్​కు న్యాయ సహాయకురాలిగా రూపా పుట్టగుంట పని చేశారు. 2007లో ఓహియో స్టేట్ మార్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జూరిస్ డాక్టర్ డిగ్రీని పొందారు. 2010 నుంచి రెండేళ్ల పాటు డీసీ కోర్ట్ ఆఫ్ అపీల్స్‌లో జడ్జిగా సేవలందించారు రూపా రంగా.

ఫెడరల్ సర్క్యూట్, జిల్లా కోర్టు జడ్జి పోస్టులకు పేర్లను ప్రతిపాదించడంలో జో బైడెన్ ప్రత్యేకతను చాటుకున్నారు. బైడెన్ నామినేట్ చేసిన వారిలో ముగ్గురు ఆఫ్రికన్-అమెరికన్ మహిళలు, ఒక ముస్లిం అమెరికన్ వున్నారు. వృత్తి నైపుణ్యం, విభిన్నరంగాల నుంచి వచ్చిన వారికి జడ్జిలుగా అవకాశాలు కల్పించారు బైడెన్‌. జడ్జి జాహిద్ ఇన్ ఖురేషి పేరును కూడా ప్రతిపాదించారు జో బైడెన్‌. సెనెట్‌ ఆమోదం పొందితే అమెరికా చరిత్రలోనే తొలి ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా నిలిచిపోనున్నారు ఖురేషి. ప్రస్తుతం న్యూజెర్సీ జిల్లా కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు పాకిస్థాన్ సంతతికి చెందిన జాహిద్ ఆన్‌ ఖురేషి.

ALSO READ: అందుకోసం అమెరికా 520 అణుబాంబులను పేల్చాలనుకుంది!