America Plan B: అందుకోసం అమెరికా 520 అణుబాంబులను పేల్చాలనుకుంది!

సూయజ్ కెనాల్‌లో పెద్ద నౌక ఇరుక్కుపోవడం.. రోజుల తరబడి అంతర్జాతీయ నౌకా రవాణా నిలిచిపోవడంతో తాజాగా అమెరికా గతంలో చేసిన ప్రతిపాదన మరోసారి...

America Plan B: అందుకోసం అమెరికా 520 అణుబాంబులను పేల్చాలనుకుంది!
America,suez Canal, America, Biden.
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 30, 2021 | 4:35 PM

America Plan B to blast many nuclear bombs: అమెరికా ఏ ఆలోచన చేసినా అందులో విధ్వంసం పాలే ఎక్కువ అంటుంటారు. పలు దేశాల మీద పెత్తనానికి అగ్రరాజ్యం తరచూ హింసా మార్గాన్నే ఎంచుకుంటుండడం చూస్తూనే వున్నాం. ఇది కేవలం పెత్తనానికే పరిమితం కాలేదు. వ్యాపార, వాణిజ్య రంగాల విస్తరణకు కూడా అమెరికా విధ్వంస మార్గాన్నే ఎంచుకుంటుందని తాజాగా వెల్లడైన ఓ అంశం తేటతెల్లం చేస్తోంది. సూయజ్ కెనాల్‌లో పెద్ద నౌక ఇరుక్కుపోవడం.. రోజుల తరబడి అంతర్జాతీయ నౌకా రవాణా నిలిచిపోవడంతో తాజాగా అమెరికా గతంలో చేసిన ప్రతిపాదన మరోసారి తెరమీదికి వస్తుంది. అయితే విధ్వంసంతో కూడిన ఈ ప్రతిపాదనపై మిగిలిన దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి వుంది.

వరల్డ్‌లోనే అత్యంత పెద్ద ఓడల్లో ఒకటిగా భావించే ఎవర్‌ గివెన్‌ (Ever Given) సూయిజ్‌ కెనాల్‌ (Suez Canal)లో అడ్డంగా ఇరుక్కుపోవడంతో ప్రపంచ వాణిజ్యం ఆల్‌మోస్ట్ ఆగిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఎలా అని అగ్రరాజ్యం అమెరికా దశాబ్దాల క్రితమే అంఛనా వేసింది. అందుకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే అంతర్జాతీయ నౌకా రవాణాకు ఆల్టర్నేట్ ఏంటని అమెరికా 60వ దశకంలోనే ఆలోచించింది. దాంతో ప్లాన్‌-బి ఏమిటీ అనే చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా కూడా ఇలాంటి చర్చ జరుగుతున్నప్పటికీ.. 60వ దశకంలో అమెరికా ఈ ఆలోచన చేసినపుడు ప్లాన్ బీ కోసం ఏకంగా అణుబాంబులను వినియోగించాలని తలపెట్టింది. ఒకటో రెండో కాదు.. ఏకంగా 520 న్యూక్లియర్ బాంబులను పేల్చాలని ప్లాన్ చేసింది. అప్పట్లో తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు పొరుగునే వున్న ఈజిప్టుతో సంబంధాలు దెబ్బతినడం.. సూయిజ్‌ కెనాల్ బ్రిటన్‌ పెత్తనం నుంచి చేజారిపోవడంతో అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ విధ్వంస పూరిత ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలించింది. కొన్ని వందల అణుబాంబులను వాడి ఇజ్రాయెల్‌లోని నెగెవా ఎడారిలో భారీ కెనాల్‌ను నిర్మించాలని, దానిని సూయజ్ కెనాల్‌కు ఆల్టర్నేట్‌గా నౌకాయానానికి వినియోగించాలని అమెరికా భావించింది.

ఈ కొత్త కెనాల్ ద్వారా మధ్యధరా సముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ అకాబాతో కలపాలన్న ప్రతిపాదన ఇది. 1963లో అమెరికా పాలకులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలించారు. ఇలా చేస్తే మధ్యధరా సముద్రం-ఎర్ర సముద్రం అనుసంధానమవుతాయి. జనావాసాలు పెద్దగా లేని నెగెవా ఎడారిని దీనికి ఎంచుకున్నారు. దాదాపు 1500 అడుగుల లోతుతో కొత్త కెనాల్‌ని ప్రత్యామ్నాయ సముద్ర మార్గంగా నిర్మించాలని తలపెట్టారు. ఇలా సుమారు 130 మైళ్ల పొడవు కెనాల్ తవ్వాల్సి వుంటుంది. ఈ స్థాయిలో తవ్వకాలు జరపాల్సి వుంటే ఒక్కో మైలుకు రెండు మెగా టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు అణుబాంబులను భూమి అంతర్భాగంలో అమర్చి పేల్చి వేయాల్సి వుటుంది. ఈ లెక్కన సూయజ్ కెనాల్‌కు ప్రత్యామ్నాయంగా 130 మైళ్ళ పొడవుతో అనుసంధాన కెనాల్‌ నిర్మించాలంటే ఏకంగా 520 అణుబాంబులను వాడాల్సి ఉంటుందని అంఛనా వేశారు. ఈ మొత్తం అణుబాంబుల శక్తి 1.04 గిగా టన్నులకు సమానం. ఇంత పెద్ద విధ్వంసాన్ని భూగర్భంలో చేసి.. తద్వారా సూయజ్ కెనాల్‌కు ఆల్టర్నేట్ కెనాల్‌ని నిర్మించాలని అమెరికా 60వ దశకంలో యోచించింది.

అమెరికా చేసిన ప్లాన్ బీ సాంకేతికంగా ఇది సాధ్యమే అని అనాడు భావించారు. అయితే.. ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్న అరబ్‌ కంట్రీస్ అమెరికా ప్లాన్ బీని తీవ్రంగా వ్యతిరేకిస్తాయనే అంశాన్ని మాత్రం విస్మరించారు. అంతేకాదు శాంతియుత ప్రతియోజనాలకు అణు విస్ఫోటాల వినియోగం అనే అంశం కింద ఈ ప్రతిపాదన చేశారు. మధ్య అమెరికాలో పలు కాల్వలు ఇలా నిర్మించాలనుకున్నారు. అయితే, దాదాపు 27 ప్రయోగాలు జరిపాక అమెరికా అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ ఓ విషయాన్ని గుర్తించింది. అణువిస్ఫోటాలు జరిపే చోట భూమి అత్యధికంగా రేడియేషన్‌ బారిన పడతుందని తేల్చింది. దాంతో 1974లో ఈ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పడేశారు. 1996లో అమెరికా ఈ ప్రతిపాదన వివరాలను ప్రపంచానికి వెల్లడించింది.

సూయిజ్‌ కెనాల్‌ కంపెనీని ఈజిప్ట్‌ బలవంతంగా జాతీయం చేయడంతో గుర్రుగా ఉన్న ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు ఇజ్రాయెల్‌ను రెచ్చగొట్టి తొలుత దాడి చేయించాయి. తర్వాత రంగంలోకి దిగి ఈజిప్ట్‌ను ఓడించాయి. దీంతో ఈజిప్ట్‌ సూయిజ్‌ కాల్వలో కొన్ని నౌకలను ముంచేసింది. మరోపక్క ఐరాస, అమెరికా జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌,బ్రిటన్‌లను వెనక్కి వెళ్లాలని హెచ్చరించింది. వాటిపై ఒత్తిడి తెచ్చేందుకు బ్రిటన్‌ కరెన్సీ అయిన పౌండ్‌ స్టెర్లింగ్‌ విలువను కుప్పకూల్చింది. దీంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫలితంగా పశ్చిమ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన దేశంగా అమెరికా అవతరించింది. మరోపక్క సూయిజ్‌ కాల్వలో ప్రయాణం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అమెరికా సూయిజ్‌ కాల్వకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ప్రతిపాదనను పరిశీలించింది.

తాజాగా ఎవర్ గివెన్ సరకు రవాణా జంబో షిప్ సూయిజ్ కెనాల్‌లో ఇరుక్కోవడం దాదాపు అయిదు రోజుల పాటు అంతర్జాతీయ నౌకా రవాణా దాదాపు నిలిచిపోవడంతో ఇపుడు మరోసారి సూయిజ్ కెనాల్‌కు ప్రత్యామ్నాయం ఏంటనే విషయం తెరమీదికి వస్తోంది. అయితే.. ఎలాంటి ప్రతిపాదన చేసినా.. అమెరికా అనుకూల, వ్యతిరేక దేశాలన్ని రెండుగా విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా క్రైసిస్ ఎదురైన నేపథ్యంలో వాణిజ్యానికి ప్రియారిటీ ఇచ్చే దేశాలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనను స్వాగతించే అవకాశాలున్నాయి.

ALSO READ: రాజోలి బండపై మళ్ళీ రాజుకుంటున్న రగడ.. అసలు చరిత్ర ఏంటంటే?

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..