Corona Spray: కరోనా కట్టడికి సరికొత్త ఆవిష్కరణ.. స్ప్రేను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు.
యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా నాశనం చేసేందుకు ఇంకా ప్రయోగలు జరుగుతూనే ఉన్నాయి. అసలు వ్యాక్సిన్ అనేదే లేని రోజుల నుంచి సరికొత్త వ్యాక్సిన్‌ల తయారీ వరకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. టీకా నుంచి...
యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా నాశనం చేసేందుకు ఇంకా ప్రయోగలు జరుగుతూనే ఉన్నాయి. అసలు వ్యాక్సిన్ అనేదే లేని రోజుల నుంచి సరికొత్త వ్యాక్సిన్‌ల తయారీ వరకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్‌ల తయారీలో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మరో కొత్త ఆవిష్కరణ చేశారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంజనీర్లు కరోనాను అడ్డుకట్ట వేసే స్ప్రేను తయారు చేశారు.
కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. సన్నగా, పోగుల మాదిరిగా ఉండే వాటిని సుప్రా మాలిక్యులార్ ఫిలమెంట్స్‌గా నామకరణం చేశారు. వీటిని ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా కరోనాతో పాటు సార్స్ వైరస్‌లను కూడా సమర్థంగా అడ్డుకోవచ్చని సైటిస్టులు చెబుతున్నారు. శ్వాస ద్వారానే కరోనా సోకడం.. దాని ఊపిరితిత్తుల్లోని కణాలతో కలిసిపోయి వ్యాధి కారకాలుగా మారడంతో స్ప్రేను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హాంగాంగ్ కుయ్.
నాజిల్ స్ప్రేను ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశామని చెప్పారు. కరోనా వైరస్ సాధారణంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఉండే ఏస్2గా పిలిచే రిసెప్టర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. తర్వాత కణంలోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎఫ్‌ల్లో ఫిలమెంట్లలోనూ ఇలాంటి సూడో రిసెప్టర్లుంటాయి. కరోనా వైరస్ లోనికి తమవైపు ఆకర్షించి అక్కడే నిలువరిస్తాయి. కరోనా తాలూకు అన్ని వేరియంట్లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..