AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23rd TANA Conference: 5 టోర్నమెంట్స్.. 120 జట్లు.. ‘తానా’ స్పోర్ట్స్ మీట్‌కు రంగం సిద్ధం..

23rd TANA Conference: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు రంగం సిద్ధమైంది. జులై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో మహాసభలు జరగనున్నాయి. అయితే, అంతకుముందు తానా కాన్ఫరెన్స్ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

23rd TANA Conference: 5 టోర్నమెంట్స్.. 120 జట్లు.. 'తానా' స్పోర్ట్స్ మీట్‌కు రంగం సిద్ధం..
23rd Tana Conference
Venkata Chari
|

Updated on: Jun 28, 2023 | 11:04 AM

Share

23rd TANA Conference: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు రంగం సిద్ధమైంది. జులై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో మహాసభలు జరగనున్నాయి. అయితే, అంతకుముందు తానా కాన్ఫరెన్స్ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈమేరకు పవర్ ప్యాక్డ్ తానా స్పోర్ట్స్ డే కోసం సిద్ధంగా ఉండాలంటూ ఓ ప్రకటన చేసింది. జులై 1, 2023న ఉదయం 7:30 గంటలకు, 23వ తానా కాన్ఫరెన్స్ స్పోర్ట్స్ మీట్‌ పేరుతో ఈ క్రీడోత్సవం నిర్వహించనున్నారు.

ఇందులో ఉత్తర అమెరికా నలుమూలల నుంచి దాదాపు 1000 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నట్లు తానా ప్రకటించింది. ఇది తానా చరిత్రలో అతిపెద్ద క్రీడా కార్యక్రమం అవుతుందని పేర్కొన్నారు. మొత్తంగా నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహించేందుకు తానా సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

మన్రో స్పోర్ట్స్ సెంటర్‌లో టెన్నిస్, బ్యాడ్మింటన్, త్రోబాల్, పికిల్‌బాల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

కాగా, పికిల్‌బాల్‌లో 20 జట్లు, బ్యాడ్మింటన్‌లో 20 జట్లు, త్రోబాల్ 20 జట్లు, టెన్నిస్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయని ప్రకటించారు.

అలాగే, బ్రాంచ్‌బర్గ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వాలీబాల్‌లో 40 జట్లు తలపడనున్నట్లు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..