జింబాబ్వే జాతిపిత, మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత
జింబాబ్వే జాతిపిత, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే వయోభార సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ముగాబే సింగపూర్‌లోకి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తురి శ్వాస విడిచినట్లు జింబాబ్వే మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా స్వాతంత్య్రానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో దేశ […]

జింబాబ్వే జాతిపిత, మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ మగగ్వా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే వయోభార సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ముగాబే సింగపూర్‌లోకి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తురి శ్వాస విడిచినట్లు జింబాబ్వే మీడియా వర్గాలు వెల్లడించాయి.
కాగా స్వాతంత్య్రానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో దేశ అధ్యక్ష పగ్గాలను స్వీకరించారు. ఇక 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా ముగాబే మూడు దశాబ్దాల పాలనకు తెరపడింది. స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ఆఫ్రికాలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరిగా ముగాబే పేరుగాంచారు.