5

పరుగులెత్తించి.. హడలెత్తించి.. బుల్ రన్.. రన్

స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ వరల్డ్ ఫేమస్. మదగజాల్లా ఉన్న బుల్స్ తో ఫైటర్లు చేసే ‘ యుధ్ధాలను ‘ చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. భీకరమైన ఆ ఫైట్స్ లో ఒక్కోసారి ఫైటర్లు తీవ్రంగా గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. తాజాగా అక్కడి కెపారోసో అనే పట్టణంలో జరిగిన ఓ ఘటన చూస్తే ఒళ్ళు జలదరించక తప్పదు. కళ్ళు తిప్పలేం కూడా. ఈ టౌన్ లో బుల్ ఫెస్టివల్ సందర్భంగా రింగ్ లోకి […]

పరుగులెత్తించి.. హడలెత్తించి.. బుల్ రన్.. రన్
Follow us

|

Updated on: Sep 05, 2019 | 4:04 PM

స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ వరల్డ్ ఫేమస్. మదగజాల్లా ఉన్న బుల్స్ తో ఫైటర్లు చేసే ‘ యుధ్ధాలను ‘ చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. భీకరమైన ఆ ఫైట్స్ లో ఒక్కోసారి ఫైటర్లు తీవ్రంగా గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. తాజాగా అక్కడి కెపారోసో అనే పట్టణంలో జరిగిన ఓ ఘటన చూస్తే ఒళ్ళు జలదరించక తప్పదు. కళ్ళు తిప్పలేం కూడా. ఈ టౌన్ లో బుల్ ఫెస్టివల్ సందర్భంగా రింగ్ లోకి మదించిన ఎద్దును నిర్వాహకులు వదిలారు. అయితే ఆ రింగ్ లో అప్పటికి ఫైటర్లు ఇంకా చేరుకోలేదు. ఈ బుల్ ఎందుకో ఒక్కసారిగా రెచ్చిపోయింది. పరుగులు పెడుతూ.. జనాల్లోకి దూసుకుపోయింది. రింగ్ కి, ప్రజలకు మధ్య ఉన్న ప్రొటెక్టివ్ వాల్ డివైడర్ ని ఎక్కేసి అవతల పడిపోయింది. దీంతో జనమంతా భయంతో హాహాకారాలు చేస్తూ తలో దిక్కూ పరుగు పెట్టారు. ఈ తొక్కిసలాటలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. కింద పడిపోయిన బుల్ మళ్ళీ లేచి వీధులవెంట పడింది. చివరకు అతి కష్టం మీద దాన్ని ఓ నది వద్ద పోలీసులు, స్థానికులు పట్టుకుని అదుపు చేయగలిగారు. అప్పటికి అది శాంతించినట్టుంది. ఓ ట్రక్కులో దాన్ని ఎక్కించి తిరిగి యథాస్థానానికి చేర్చారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అయింది.