పాములతో పాకిస్తానీ సింగర్..మోదీని బెదిరిస్తూ..

పాములతో పాకిస్తానీ సింగర్..మోదీని బెదిరిస్తూ..

‘ మోదీజీ ! నేను పాములతో మీ దేశానికి వస్తున్నా.. మీరు కాశ్మీరీలను ఎందుకు వేధిస్తున్నారు ? మీకోసం గిఫ్టులుగా ఈ పాములను తెస్తున్నా.. నరకానికి వెళ్ళడానికి సిధ్ధంగా ఉండండి.. ‘ అంటోంది పాకిస్తానీ పాప్ సింగర్ రబీ పిర్జాదా ! ఎక్కడినుంచో కొన్ని పాములను, ఓ మొసలిని పట్టుకొచ్చి పాట పాడుతూ… తన చేతిలో పాములను మెలికలు తిప్పుతూ ఈమె చేసిన ఈ వెరైటీ… నిరసనపూర్వక నిర్వాకం తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఆర్టికల్ 370 […]

Pardhasaradhi Peri

|

Sep 05, 2019 | 2:12 PM

‘ మోదీజీ ! నేను పాములతో మీ దేశానికి వస్తున్నా.. మీరు కాశ్మీరీలను ఎందుకు వేధిస్తున్నారు ? మీకోసం గిఫ్టులుగా ఈ పాములను తెస్తున్నా.. నరకానికి వెళ్ళడానికి సిధ్ధంగా ఉండండి.. ‘ అంటోంది పాకిస్తానీ పాప్ సింగర్ రబీ పిర్జాదా ! ఎక్కడినుంచో కొన్ని పాములను, ఓ మొసలిని పట్టుకొచ్చి పాట పాడుతూ… తన చేతిలో పాములను మెలికలు తిప్పుతూ ఈమె చేసిన ఈ వెరైటీ… నిరసనపూర్వక నిర్వాకం తాలూకు వీడియో వైరల్ అవుతోంది. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈ సింగర్ ఇలా వినూత్న ప్రొటెస్ట్ చేసింది. అయితే పాక్ లోని చిన్న చిన్న మార్కెట్లలో 50 రూపాయలకే దొరికే కోరల్లేని పాములతో, జీవం చచ్చిన మొసలితో ఈ గాయనిగారు పాటలు పాడడం, అదీ మోదీని ఉద్దేశించి ఈ వీడియో విడుదల చేయడం నవ్వులు పూయిస్తోంది. నెటిజన్లు పడీపడీ నవ్వుతూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నీ ఇంట్లో ఈ పాములతో కాశ్మీరీ పాటలు పాడుకో అని కొందరు అంటే.. మరికొందరు.. మహాతల్లీ ! నీకసలు 370 అధికరణం అంటే ఏమిటో తెలుసా అని సెటైర్లు వేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu