వామ్మో! పాఠశాలకు రూ.618 కోట్ల కరెంటు బిల్లు

వామ్మో! పాఠశాలకు రూ.618 కోట్ల కరెంటు బిల్లు

ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకా అయిన వారణాసిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ పాఠశాల నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. కలలో కూడా ఊహించని విధంగా ఆ సదరు పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. దీనితో యాజమాన్యం కళ్ళు బైర్లు కమ్మాయి. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భారీ బిల్లు గురించి స్కూల్ యాజమాన్యం విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు తగిన చర్యలు తీసుకోలేదని పాఠశాల […]

Ravi Kiran

|

Sep 06, 2019 | 2:05 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకా అయిన వారణాసిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ పాఠశాల నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు. కలలో కూడా ఊహించని విధంగా ఆ సదరు పాఠశాలకు ఏకంగా రూ.618 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. దీనితో యాజమాన్యం కళ్ళు బైర్లు కమ్మాయి. వారణాసిలోని వినాయక్ కాలనీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ భారీ బిల్లు గురించి స్కూల్ యాజమాన్యం విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు తగిన చర్యలు తీసుకోలేదని పాఠశాల నిర్వాహకులు వాపోయారు. సాఫ్ట్‌వేర్ సమస్య అని తెలిసి కూడా అధికారులు ఈ నెల 7లోగా తమను బిల్లు కట్టమన్నారని.. లేకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరించినట్లు పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది. గతంలో కూడా పలుమార్లు ఇలాగే బిల్లులు తప్పుగా వచ్చాయని.. అప్పుడు అధికారుల ద్రుష్టి తీసుకెళ్లామని స్కూల్ నిర్వాహకులు వెల్లడించారు. మరి తాజాగా తలెత్తిన సమస్యపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu