AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ సిగ్నల్స్ జంప్ చేస్తే.. పోలీసులకు భారీ జరిమానాలు!

నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ ట్రాఫిక్ ఫైన్‌లపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి తరుణంలో మరో సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూ చౌదరి ఆదేశించారు. ఇక ఈ ఆదేశాలు సెప్టెంబర్ 4నే ఆయా శాఖలకు కూడా వెళ్లిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు, […]

అక్కడ సిగ్నల్స్ జంప్ చేస్తే..  పోలీసులకు భారీ జరిమానాలు!
Ravi Kiran
|

Updated on: Sep 06, 2019 | 11:48 AM

Share

నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ ట్రాఫిక్ ఫైన్‌లపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి తరుణంలో మరో సంచలన నిర్ణయాన్ని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని ఢిల్లీ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ మీనూ చౌదరి ఆదేశించారు. ఇక ఈ ఆదేశాలు సెప్టెంబర్ 4నే ఆయా శాఖలకు కూడా వెళ్లిపోయాయి.

ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మీనూ చౌదరి హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా తీవ్రంగా పరిగణించి డబుల్ జరిమానాలు విధిస్తామని అన్నారు. రెండు సార్లు చలాన్లు విధించిన తర్వాత.. వాటిని చెల్లించకపోతే కోర్టుకు పంపిస్తామని తెలిపారు. 2018లో 250 మంది పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని, ఈ ఏడాదిలో ఇప్పటివరకు వందమంది పోలీసులపై కేసులు కూడా ఉన్నాయన్నారు. పోలీసులు రూల్స్ అతిక్రమించకుండా ఉండేలా ఇప్పటికే 626 మంది పోలీసులకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మీనూ చౌదరి స్పష్టం చేశారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..