కౌశల్ సంచలన నిర్ణయం.. అనాధలకు ‘సంజీవని రధం’

కౌశల్ సంచలన నిర్ణయం.. అనాధలకు 'సంజీవని రధం'

కౌశల్ మందా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కౌశల్.. ఆ సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షో మొదట్లో అతడు ఎవరికీ పరిచయం లేకపోయినా.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లు అతడిని టార్గెట్ చేయడంతో చాలామంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడిన కష్టాలు చూసి ప్రేక్షకుల భారీ ఎత్తున ఓట్లు వేశారు. షో చివరికి అతడి పేరు మీద […]

Ravi Kiran

|

Sep 06, 2019 | 2:59 AM

కౌశల్ మందా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు సుపరిచితమే. బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కౌశల్.. ఆ సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షో మొదట్లో అతడు ఎవరికీ పరిచయం లేకపోయినా.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లు అతడిని టార్గెట్ చేయడంతో చాలామంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడిన కష్టాలు చూసి ప్రేక్షకుల భారీ ఎత్తున ఓట్లు వేశారు. షో చివరికి అతడి పేరు మీద ఆర్మీ కూడా ఏర్పాటైంది. దీంతో తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కౌశల్ పెద్ద స్టార్ అయ్యాడు. ఇక తాజాగా అతడు ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు.

హీరోయిన్ హెబ్బా పటేల్‌తో శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిలింను డైరెక్ట్ చేస్తున్న కౌశల్.. అనాధల కోసం బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నాడు. కౌశల్ ఇప్పటికే తన ఎన్జీఓ ద్వారా చాలామంది పేదలకు సహాయం అందించాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో ఆహారం దొరక్క అలమటించే వారి కోసం కౌశల్ ఆర్మీ ‘సంజీవని రథం’ అనే పధకం ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా ఏదైనా ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని తీసుకుని అనాధ పిల్లలకు, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో నివసిస్తున్న వారికి పంచనున్నారు. కాగా దీని గురించి వివరిస్తూ కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

https://www.instagram.com/tv/B18zZMdFr7H/?utm_source=ig_web_copy_link

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu