తెలివిలేని.. కంటెస్టెంట్స్..! బిగ్‌బాస్ ఫైర్
ఒళ్లంతా పులిసిపోయేలా పోరాడినా.. ఫలితం దక్కలేదు. టాస్క్ అంటే తెలివిగా ఆడాలి కానీ.. అతి తెలివి ప్రదర్శిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో.. ఇప్పుడిప్పుడే హౌస్‌మేట్స్‌కు అర్థమవుతోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా.. వీళ్లు మారరా బాబు అంటూ తలనొప్పి తెస్తున్నారు..! టాస్క్‌ను టాస్క్‌లా హ్యాండిల్ చేయకుండా.. అదో యుద్ధంలా పోరాడారు. ఒకరిపై ఒకరు పడి.. నెట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. తోసుకుంటూ.. మహాసంగ్రామాన్నే తలపించేలా తన్నుకునే స్టేజ్ వరకు వెళ్లారు. ఇంకేముంది.. బిగ్‌బాస్‌కు కోపం తెప్పించారు.. చివరకు అనుభవించారు. టాస్క్ అన్న తర్వాత […]
ఒళ్లంతా పులిసిపోయేలా పోరాడినా.. ఫలితం దక్కలేదు. టాస్క్ అంటే తెలివిగా ఆడాలి కానీ.. అతి తెలివి ప్రదర్శిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో.. ఇప్పుడిప్పుడే హౌస్‌మేట్స్‌కు అర్థమవుతోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా.. వీళ్లు మారరా బాబు అంటూ తలనొప్పి తెస్తున్నారు..! టాస్క్‌ను టాస్క్‌లా హ్యాండిల్ చేయకుండా.. అదో యుద్ధంలా పోరాడారు. ఒకరిపై ఒకరు పడి.. నెట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. తోసుకుంటూ.. మహాసంగ్రామాన్నే తలపించేలా తన్నుకునే స్టేజ్ వరకు వెళ్లారు. ఇంకేముంది.. బిగ్‌బాస్‌కు కోపం తెప్పించారు.. చివరకు అనుభవించారు.
టాస్క్ అన్న తర్వాత పోరాటం ఉండాలి.. కానీ ఆరాటం కాదు. టాస్క్‌లో నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలన్నది బిగ్‌బాస్ చెప్పకముందే.. మనోళ్లు రంగంలోకి దిగారు. రాణిగారి తుపాకీ కోసం ఫిజికల్‌గా అటాక్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో… తెలుసుకదా… షరా మామూలే.. నెట్టుకోవడం.. తిట్టుకోవడం… గేమ్ కాస్తా రచ్చ రచ్చ కావడం.
అసలు గేమ్ రూల్స్ ఏంటో తెలియకుండానే ఇంటిసభ్యుల మధ్య వాదన మొదలవుతుంది. వారి వాదనకు బ్రేకప్ చెబుతూ… బిగ్‌బాస్ నెక్స్ట్ లెవల్ రూల్స్ ఏంటో వివరిస్తాడు. రాణిగారి తుపాకీని కొట్టేయడం…రాణిగారిని సింహాసనం నుంచి దించేయడం…అలాగే రాణిగారిని జైల్లో పెట్టడం..ఈ మూడింటినీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే.. నగరవాసులు విజయం సాధిస్తారు. లేకుంటే దొంగలు టాస్క్‌ను కైవసం చేసుకుంటారు. కానీ.. అలా జరగలేదుగా..!
నగరవాసుల నుంచి తప్పించుకున్న రాణిగారు.. స్విమ్మింగ్‌పూల్‌లో దూకేస్తారు. ఆమెను కాపాడేందుకు దొంగల ముఠా కూడా దూకేస్తుంది.. రాణిని జైలులో పెట్టేందుకు నగరవాసులు సైతం ఆ నీటికొలనులోకి దూకేస్తారు.. ఇంకేముంది.. సిగపట్ల ఓరేంజ్‌లో సెగలు రేపుతాయి.
ఇంటిసభ్యుల గేమ్‌ను చూసిన బిగ్‌బాస్‌కు భయం పట్టుకుంది. పదే పదే హెచ్చరిస్తున్నా.. హౌస్‌మేట్స్ పట్టించుకోకపోవడంతో.. టాస్క్‌ను రద్దు చేస్తాడు. అలాగే టాస్క్ రద్దు అయ్యేలా ప్రవర్తించిన ఇంటిసభ్యులను శిక్షించేందుకు సిద్ధమౌతాడు. టాస్క్‌లో రూల్స్ పాటించకుండా, రూడ్‌గా బిహేవ్ చేసిన రవి, రాహుల్‌కు జైలు శిక్ష వేస్తాడు బిగ్‌బాస్. కాగా.. ఈవారం అలీ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, హిమజలు నామినేట్ అయ్యారు.