5

బిగ్‌బాస్: వెక్కి‌వెక్కి ఏడ్చిన పెళ్ళాం.. ఫైర్ అయిన మొగుడు

ఇప్పటి వరకూ తెలుగు బిగ్‌బాస్‌లో ఎవరికీ దక్కని ఛాన్స్.. వితికా షేరు-వరుణ్ సందేశ్‌లకి దక్కింది. మొగుడు, పెళ్లాలుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మొదటిసారిగా అడుగుపెట్టారు. మొదటి నుంచీ.. వరుణ్ కాస్త.. నెమ్మదస్తుడే.. కానీ.. తప్పు ఎవరు చూపినా.. నిర్మొహమాటంగా.. చెప్పేస్తాడు. ఇక వితిక.. చిన్న దాన్ని పెద్దచేసి చూపడంలో నెంబర్ వన్ అని బిగ్‌బాస్ ప్రేక్షకులు అంటున్నారు. ఊరికే అలగడం.. వరుణ్ వచ్చి ఓదార్చడం షరా మామూలయిపోయింది. ఇక అప్పుడప్పుడు వాళ్ల రొమాన్స్‌ను కూడా తట్టుకోవడం కష్టమే. అంత […]

బిగ్‌బాస్: వెక్కి‌వెక్కి ఏడ్చిన పెళ్ళాం.. ఫైర్ అయిన మొగుడు
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 7:59 PM

ఇప్పటి వరకూ తెలుగు బిగ్‌బాస్‌లో ఎవరికీ దక్కని ఛాన్స్.. వితికా షేరు-వరుణ్ సందేశ్‌లకి దక్కింది. మొగుడు, పెళ్లాలుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మొదటిసారిగా అడుగుపెట్టారు. మొదటి నుంచీ.. వరుణ్ కాస్త.. నెమ్మదస్తుడే.. కానీ.. తప్పు ఎవరు చూపినా.. నిర్మొహమాటంగా.. చెప్పేస్తాడు. ఇక వితిక.. చిన్న దాన్ని పెద్దచేసి చూపడంలో నెంబర్ వన్ అని బిగ్‌బాస్ ప్రేక్షకులు అంటున్నారు. ఊరికే అలగడం.. వరుణ్ వచ్చి ఓదార్చడం షరా మామూలయిపోయింది. ఇక అప్పుడప్పుడు వాళ్ల రొమాన్స్‌ను కూడా తట్టుకోవడం కష్టమే.

అంత రొమాంటిక్‌గా వున్న వాళ్లను.. బిగ్‌బాస్ ఊరికనే ఉండనిస్తాడా.. అప్పుడప్పుడు ఏదో ఒక అగ్గిపుల్ల రాజేస్తూ ఉండేవాడు. కానీ.. దీన్ని ఆ రొమాటింక్ కపిల్.. మంచిగా డీల్ చేసుకుంటూ వచ్చారు. ఇక రెండు వారాల నుంచి వితిక, వరుణ్‌ల మధ్య.. దూరం పెరుగుతూ వస్తోంది. నీది తప్పంటే.. నీది తప్పని అలగడాలు.. అరుచుకోవడాలు స్టార్ట్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే.. వితిక.. వెక్కి వెక్కి ఏడుస్తూ.. వరుణ్ ఏమాత్రం సంబంధం లేకుండా పడుకుని ఉంటాడు. వితిక ఏడుస్తున్నందుకు.. వరుణ్ ఫైర్ అవుతాడు. దానికి వితిక ఇంకా ఏడుస్తూనే ఉంటాది. నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా పోయి.. వారితో మాట్లాడుకో.. అంటూ అరుస్తూ.. ఉంటాది. దానికి వరుణ్.. 24 గంటలూ నీతోనే ఉంటున్నాను కదా..! ఇంకేకావాలి.. ఇదే అర్థం చేసుకున్నావ్ అంటూ.. ఇద్దరూ గొడవ స్టార్ట్ చేస్తారు.

కాగా.. వరుణ్-వితికల మధ్య గొడవ అప్పుడే సద్దుమణగలేదు.. ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది.. మరి భార్యభర్తల మధ్య అలకలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో.. ఇవాళ ఎపిసోడ్‌లో చూడాలి.

Bigg Boss3: Varun sandesh slams Vithika sheru