బిగ్ బాస్ 3: ఆ ఇద్దరిలో ‘ఎవరు’ బయటికి.?
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి రెండు రోజులు షోని తనదైన శైలి కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈవారం వైల్డ్ కార్డు ద్వారా శిల్పా చక్రవర్తి ఎంట్రీతో షో ఆసక్తికరంగా మారింది. అలాగే అలీ, శ్రీముఖి, రవి కృష్ణ, మహేష్, రాహుల్ ఎలిమినేషన్స్‌లో ఉన్న […]

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి రెండు రోజులు షోని తనదైన శైలి కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈవారం వైల్డ్ కార్డు ద్వారా శిల్పా చక్రవర్తి ఎంట్రీతో షో ఆసక్తికరంగా మారింది. అలాగే అలీ, శ్రీముఖి, రవి కృష్ణ, మహేష్, రాహుల్ ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
గతవారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈవారం ఖచ్చితంగా ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్లనున్నారు. ఇక ఆ ఐదుగురుని ఒకసారి పరిశీలిస్తే.. అలీ, శ్రీముఖి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు దాదాపు లేనట్లేనని సమాచారం. అటు రవికృష్ణ కూడా సేఫ్ జోన్‌లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక మిగిలిన ఇద్దరు సభ్యులైన రాహుల్, మహేష్ విట్టా లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి ఈవారం హౌస్‌ను విడిచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.