‘చంద్రయాన్ 2’ విజయం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది: మాజీ వ్యోమగామి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని నాసా మాజీ వ్యోమగామి జెర్సీ మైఖేల్ లినెన్‌గర్ అన్నారు. ‘‘కేవలం భారత్‌ మాత్రమే కాదు చంద్రయాన్ 2 సక్సెస్ కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవ మేధస్సు గొప్ప విజయాలను సాధిస్తుంది. నేను ఒక అమెరికా వ్యోమగామిని. కానీ ఈ మిషన్‌పై మేమందరం ఆసక్తిగా ఉన్నాం అని’’ జెర్సీ అన్నారు. చంద్రయాన్ 2పై ఓ అంతర్జాతీయ ఛానెల్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:55 pm, Fri, 6 September 19
‘చంద్రయాన్ 2’ విజయం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది: మాజీ వ్యోమగామి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని నాసా మాజీ వ్యోమగామి జెర్సీ మైఖేల్ లినెన్‌గర్ అన్నారు. ‘‘కేవలం భారత్‌ మాత్రమే కాదు చంద్రయాన్ 2 సక్సెస్ కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవ మేధస్సు గొప్ప విజయాలను సాధిస్తుంది. నేను ఒక అమెరికా వ్యోమగామిని. కానీ ఈ మిషన్‌పై మేమందరం ఆసక్తిగా ఉన్నాం అని’’ జెర్సీ అన్నారు.

చంద్రయాన్ 2పై ఓ అంతర్జాతీయ ఛానెల్ లైవ్‌ను ఇస్తుండగా.. ఆ కార్యక్రమంలో జెర్సీ భాగం అవ్వనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రయాన్‌ 2పై నా ఉత్సుకతను భారతీయులతో కలిసి షేర్ చేసుకునేందుకు సగం ప్రపంచాన్ని చుట్టి వచ్చాను. ఇది భారత దేశ ఖ్యాతిని తెలిపే ప్రయోగం. మనందరికి భవిష్యత్‌ అద్భుతంగా ఉండబోతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ విజయవంతంగా ప్రవేశించగా.. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.