AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill gates divorce: ప్రముఖ వ్యక్తులు విడాకులు తీసుకోవడం సాధారణమేనా? ప్రపంచంలో భార్యలతో విడిపోయిన ప్రముఖులు వీరే!

పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన బిల్ గేట్స్, మెలింద దంపతుల నిర్ణయం సంచలనంగా మారింది.

Bill gates divorce: ప్రముఖ వ్యక్తులు విడాకులు తీసుకోవడం సాధారణమేనా? ప్రపంచంలో భార్యలతో విడిపోయిన ప్రముఖులు వీరే!
Bill Gates Divorce
KVD Varma
|

Updated on: May 04, 2021 | 3:17 PM

Share

Bill gates divorce: పెళ్లి చేసుకున్న 27 ఏళ్ల తరువాత విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన బిల్ గేట్స్, మెలింద దంపతుల నిర్ణయం సంచలనంగా మారింది. 1994 లో వివాహం చేసుకున్న బిల్ గేట్స్, మెలింద ఇప్పుడు విదిపోతున్నామంటూ చెప్పడం చాలా మందికి బాధ కలిగించింది. అయినా, వారి వ్యక్తిగత వ్యవహారం కదా. అయితే, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు విడాకులు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఒక స్థాయి దాటిన తరువాత ప్రపంచంలోనే ప్రముఖమైన స్థానంలోకి చేరిన తరువాత విడాకులు తీసుకున్న ప్రముఖులు చాలా మందే  ఉన్నారు. వారెవరో ఈ సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం..

  • బ్రిటిష్ రాజకుటుంబం నుంచి విడిపోయిన​ ప్రిన్స్‌ హ్యారీ,మేఘన్​ మార్కెల్​ దంపతులు. 2018లో అమెరికా నటి మేఘన్‌ మార్కెల్‌ను వివాహం చేసుకున్న హ్యారీ.
  • దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా. ఆయన మూడు సార్లు వివాహం చేసుకున్నారు. 1944 లో మొదటి వివాహం ఎవెలిన్ న్టోకో మాస్‌ తో జరిగింది. ఆమె నుంచి 1957 లో విడాకులు తీసుకున్నారు నెల్సన్‌ మండేలా. 1958 లో విన్నీ మడికిజెలా తో రెండోసారి వివాహం జరిగింది. 38 ఏళ్ల పాటు వారి వివాహ బంధం కొనసాగింది. 1996లో ఆమెకు విడాకులు ఇచ్చిన నెల్సన్‌ మండేలా. 1998లో తన 80వ జన్మదినం సందర్భంగా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్ళి చేసుకున్నారు నెల్సన్ మండేలా. 2013 లో మరణించే వరకు మాచెల్‌ తో కలిసి ఉన్నారు ఆయన.
  • బిలియనీర్‌ ఫేస్‌బుక్‌ సృష్టి కర్త మార్క్ జుకర్‌బర్గ్ ఆమె భార్య ప్రిస్సిల్లా చాన్ కూడా విడాకులు తీసుకున్నారు.
  • ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అతని భార్య మాకెంజీ.. 25 సంవత్సరాల వివాహం తరువాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటీంచారు.

అలాగే విడాకులు పొందిన మరి కొందరు ప్రముఖులు..

  • హ్యూ లారీ మరియు జో గ్రీన్
  • హ్యూ జాక్మన్ మరియు డెబోరా-లీ ఫర్నెస్
  • జోష్ హోల్లోవే మరియు జెస్సికా కుమల
  • పియర్స్ బ్రాస్నన్ మరియు కీలీ షే స్మిత్
  • డిమిత్రి పెస్కోవ్ మరియు అతని భార్య
  • స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఆండ్రీ అర్షవిన్
  • బోయార్స్కీ కుమార్తె మరియు మాగ్జిమ్ మాట్వీవ్

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే. మొత్తమ్మీద బిల్ గేట్స్ విడాకుల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also Read: World best Countries: ప్రపంచంలో ప్రజలు ప్రశాంతంగా జీవించే అవకాశాలున్న దేశాలు ఆ రెండే! మరి మన దేశం స్థానం ఎంతో తెలుసా?

Udhayanidhi Stalin: ఈ యంగ్ హీరో అటు పొలిటికల్ గానూ.. ఇటు హీరోగానూ రాణిస్తాడా..