Imran Khan: గద్దె దింపేందుకు అమెరికా కుట్ర.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..
Imran Khan on America: పాలకులు తమ పదవులను కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. అందుకు ఫర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. తన పదవిని కాపాడుకోవడానికి తాజాగా కొత్త నాటకానికి తెరతీశారు పాక్ పీఎం ఇమ్రాన్..
Imran Khan on America: పాలకులు తమ పదవులను కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. అందుకు ఫర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. తన పదవిని కాపాడుకోవడానికి తాజాగా కొత్త నాటకానికి తెరతీశారు పాక్ పీఎం ఇమ్రాన్.. సాధారణంగా.. ఎలక్షన్స్ వచ్చినా, రాజకీయంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయినా సెంటిమెంట్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడం ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్‌గా మారింది. తాజాగా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దేవుడి దయవల్ల ఈ వ్యక్తి అధికారంలో కొనసాగకూడదు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ వ్యాఖ్యలు పెనుదుమారానికి దారితీశాయి. పరాయి దేశాల్లో ప్రభుత్వాలను మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందనే అర్థం ప్రపంచంలోకి వెళ్లింది. శ్వేతసౌధం వెంటనే ఈ కామెంట్స్‌పై వివరణ ఇస్తూ, బైడెన్ ఉద్దేశం అది కాదని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే బైడెన్ కామెంట్స్‌ను అందిపుచ్చుకున్నారు పాక్ (Pakistan) పీఎం ఇమ్రాన్ ఖాన్.. తనను అధికారం నుంచి దింపేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఇమ్రాన్ అధికారంలో కొనసాగితే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు చెప్పారు పాక్ పీఎం. బైడెన్ బూచీగా చూపి, రాజకీయంగా లబ్ధిపొందాలని ప్లాన్ చేశారు. అయితే, ఇమ్రాన్ ఆరోపణలను అమెరికా (US) ఖండించింది.
ఇమ్రాన్ ఆరోపణలపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్‌ప్రైస్ స్పందించారు. ఆ ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. పాకిస్థాన్‌లోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, అక్కడి రాజ్యాంగ విధానాలకు, చట్టానికి తమ దేశం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అటు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకమయ్యాయి. ఫలితంగా 342 మంది ఉన్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాసం వీగిపోవాలంటే, 172 ఓట్లు ఇమ్రాన్‌కు అవసరం. కానీ, ఆయనకు వ్యతిరేకంగా 196 ఓట్లు ఉన్నాయని, దీంతో ఖాన్ ఓటమి ఖాయమైనట్లేనని పాక్ నేతలు పేర్కొంటున్నారు.
Also Read: