Pakistan: పాకిస్తాన్ లో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల్లో హిందూ మతం గురించి ఏం చెబుతారో తెలుసా?
మతపరమైన విద్వేషంతో ఏర్పాటు అయిన దాయాది దేశం పాకిస్థాన్. ఏళ్లు గడిచిపోయినా తన మత విద్వేషాన్ని కక్కుతూనే ఉంది ఆ దేశం. అక్కడ కేవలం రెండు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు.
Pakistan: మతపరమైన విద్వేషంతో ఏర్పాటు అయిన దాయాది దేశం పాకిస్థాన్. ఏళ్లు గడిచిపోయినా తన మత విద్వేషాన్ని కక్కుతూనే ఉంది ఆ దేశం. అక్కడ కేవలం రెండు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. అయినా సరే..వారిని కూడా స్థానికంగా ఉండే ముస్లింలతో కలిసి మెలిసి ఉండే అవకాశం లేకుండా చూస్తూ వస్తున్నారు పాకిస్తాన్ పాలకులు. అందులో భాగంగానే అక్కడి పాఠ్య పుస్తకాలలో హిందువులపై ద్వేషం కలిగేలా కథనాలు అందించి.. పసి వయసునుంచే అక్కడి పిల్లల్లో హిందూ మతంపై ద్వేషాన్ని రగిలిస్తూ వస్తున్నారు. అందుకే అక్కడ రోజు రోజుకీ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల ఒక యూ ట్యూబ్ వీడియో వెల్లడించింది. బీబీసీ పాకిస్తాన్ సర్వీస్ తయారు చేసిన అ వీడియో పాకిస్తాన్ చరిత్ర పుస్తకాలు హిందువుల గురించి ఏమి రాస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేసింది.
ఈ వీడియోలో పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో నివసిస్తున్న కొందరు పాకిస్తాన్ హిందువులు ఉన్నారు. వారంతా తమ పాఠశాలలో చిన్నపుడు చదివిన చరిత్ర పుస్తకాలు చేతిలో పాతుకుని కనిపిస్తున్నారు. వీరంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గలిగిన యువకులు. వీరు తాము స్కూల్లో చదివిన చరిత్ర పుస్తకాల్లో హిందువులపై ఏమి రాశారో వివరించి చెప్పారు.
వీడియోలో ఉన్నవారిలో జర్నలిస్ట్ సంజయ్ మథారాణితొ పాటు వైద్య నిపుణుడైన సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు చెందిన రాజేష్ కుమార్, డాక్టర్ రాజ్‌వంతి కుమారి, కాలమిస్ట్ పారా మంగ్లీ, డాక్టర్ సువ్రత్ ఉన్నారు. సంజయ్ ”చరిత్రలో హిందువులు ముస్లింలను చాలా హింసించారని రాసి ఉంది. అలాగే కాఫిర్ అంటే విగ్రహాలను ఆరాధించే వారనీ..ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపేస్తారనీ రాసి ఉంది.” అని చెప్పారు.
సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు చెందిన రాజేష్ కుమార్ వైద్య నిపుణుడే కాకుండా సామాజిక కార్యకర్త కూడా. ఆయన సింధ్ టెక్స్ట్ బుక్ బోర్డ్ యొక్క 11 ,12 తరగతుల సిలబస్‌లో చేర్చబడిన పాకిస్తాన్ స్టడీస్ గురించి వివరించారు. ఈ పుస్తకం ఆయన కాలేజీలో చదివానని చెప్పారు. ఆ పుస్తకం ౩౩వ పేజీలో మానవజాతి శత్రువులైన హిందువులు, సిక్కులు వేలాది మందిని దారుణంగా చంపారు. అవమానించారు. వారిలో లక్షలాదిమంది మహిళలు, పిల్లలు, వృద్ధులు అదేవిధంగా యువత కూడా ఉన్నారని రాసి వుంది.
అలాగే డాక్టర్ రాజ్వంటి కుమారి తన తొమ్మిదొ తరగతి పాకిస్తాన్ అధ్యయన పుస్తకాల్లో హిందువులను ముస్లింల శత్రువులుగా అభివర్ణించారని చెప్పారు. “సంకుచితత్వం హిందూ సమాజాన్ని స్తంభింపజేసింది. దీనిలో స్త్రీకి కింది స్థానం ఇవ్వబడింది.” అని తాను పాకిస్తాన్ ఇంటర్మీడియట్ పుస్తకంలో చదివినట్టు షికార్ పూర్ కు చెందిన పారా చెప్పారు. అయితే, వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుదనీ.. హిందూ మతంలో స్త్రీని దేవతగా పూజిస్తారనీ, దుర్గామతా, కాళీ మాతా అని కొలుస్తారని చెప్పారు.
థార్ పార్కర్‌లో నివసిస్తున్న జర్నలిస్ట్ సంజయ్ మిథారాణి ప్రకారం, పాకిస్తాన్‌లో హిందువుగా జీవించడం చాలా కష్టమైన పని. పాకిస్థాన్‌కు చెందిన ప్రసిద్ధ హిందువులను, వారి విజయాలను సిలబస్‌లో చెబితే, హిందూ విద్యార్థులు ఈ విషయాలపై ఆసక్తి చూపడమే కాకుండా, ఇతర విద్యార్థులతొ సమన్వయం కూడా పెరుగుతుందని సంజయ్ అభిప్రాయపడ్డారు. ఇది జాతీయ ఐక్యతను పెంపొందించడానికి సహాయపడుతుంది అని ఆయన చెప్పారు.
Also Read: US: ఫెడెక్స్ కాల్పుల ఘటనలో.. నలుగురు సిక్కులు సహా 8 మంది మృతి.. స్పందించిన భారత్
జూమ్ మీటింగ్‌లో అనుకోని దృశ్యాలు… నగ్నంగా దర్శనమిచ్చిన ఎంపీ….!! ( వీడియో )