US: ఫెడెక్స్ కాల్పుల ఘటనలో.. నలుగురు సిక్కులు సహా 8 మంది మృతి.. స్పందించిన భారత్
FedEx Shooting In US: అమెరికాలో మళ్లీ గన్ కల్చర్ తీవ్ర స్థాయికి చేరింది. తరచూ కాల్పుల ఘటనలతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వరుస కాల్పుల ఘటనలు అగ్రరాజ్యాన్ని
FedEx Shooting In US: అమెరికాలో మళ్లీ గన్ కల్చర్ తీవ్ర స్థాయికి చేరింది. తరచూ కాల్పుల ఘటనలతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వరుస కాల్పుల ఘటనలు అగ్రరాజ్యాన్ని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా గురువారం రాత్రి ఇండియానా పోలిస్‌లోని ఫెడెక్స్ ఫెసిలిటీ ఆఫీసు వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఎనిమిది మందిలో నలుగురు సిక్కులు ఉన్నారు. క్షతగాత్రుల్లో భారత సంతతికి చెందిన ఓ యువతి కూడా ఉంది. కాగా.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఫెడెక్స్‌లో మాజీ ఉద్యోగి బ్రెండన్ హోలే (19) గా గుర్తించారు. పోలీస్ ఐడీతో ఆ ప్రాంతంలోకి వెళ్లిన దుండగుడు కాల్పులు జరిపి.. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లోని పరిధిలో జరిగిన ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేసి సాధ్యమైనంత మేర సహాయం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి కూడా పలు సూచనలు చేశారు. అయితే.. ఈ డెలివరీ సర్వీస్ ఫెసిలిటీలో 90 శాతం మంది కార్మికులు భారతీయ-అమెరికన్లు పనిచేస్తున్నారు. ఎక్కువగా సిక్కు వర్గానికి చెందినవారున్నారు. ఇండియానాపోలిస్‌లో ఈ ఏడాదిలోనే ఇలాంటి దాడి జరగడం మూడోసారని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ శుక్రవారం మరణించిన వారి పేర్లను విడుదల చేసింది. అమర్జీత్ జోహల్ (66), జస్విందర్ కౌర్ (64), అమర్జిత్ స్కోన్ (48), జస్విందర్ సింగ్ (68) మరణించినట్లు పేర్కొన్నారు.
Also Read: