Citi Bank India Exit: సిటీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. భారతదేశంలో వినియోగదారుల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన.. కారణం అదేనా..?

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్​ దిగ్గజం సిటీ బ్యాంక్​ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​తో సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్​ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

Citi Bank India Exit:  సిటీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. భారతదేశంలో వినియోగదారుల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన.. కారణం అదేనా..?
Citi Bank
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2021 | 4:25 PM

CITI group to shutter: అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్​ దిగ్గజం సిటీ బ్యాంక్​ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​తో సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్​ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, సిటీ బ్యాంక్ కన్స్యూమర్ వ్యాపార విభాగం కింద​ ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్, హోమ్​ లోన్స్​, వెల్త్​ మేనేజ్​మెంట్​ వంటి సేవలందిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 35 శాఖల ద్వారా సిటీ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. కన్స్యూమర్​ బ్యాంకింగ్ వ్యాపారంలో సుమారు 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

తాజా నిర్ణయంపై సిటీ బ్యాంక్ గ్లోబల్​సీఈఓ జేన్​ ఫ్రేజర్​ మాట్లాడుతూ ‘‘భారత్​ సహా 13 దేశాల్లో కన్స్యూమర్​ బ్యాంకింగ్ వ్యాపారాల నుండి తప్పుకోవాలిన నిర్ణయించామన్నారు. ఈ మార్కెట్లలో తమ బ్యాంక్​ ఇతర బ్యాంకులతో పోటీపడలేకపోతుండటమే వైదొలగడానికి ముఖ్య కారణమని ఆయన స్పష్టం చేశారు. టోరంటో కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకింగ్ దిగ్గజం వార్షిక లాభాల్లో భారత్‌లోని రిటైట్ వ్యాపారం ద్వారా వస్తున్నది చాలా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత్ సంస్థ అర్జించింది కేవలం 20 శాతం మాత్రమే. ఇది అంతర్జాతీయ లాభాలతో పోల్చితే 1.5 శాతం మాత్రమేనని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోని వినియోగదారుల వ్యాపారం నుంచి బయటకువచ్చి.. పూర్తిగా కార్పొరేట్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని సిటీ గ్రూప్ భావిస్తోంది. కాగా, సిటీ బ్యాంక్ శతాబ్దం క్రితం 1902లో భారతదేశంలోకి అడుగుపెట్టింది. 1985 నుండి కన్స్యూమర్​ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.

ఇదిలావుంటే, సిటీ బ్యాంక్​ ఈ వ్యాపారం నుంచి ఎలా వైదొలగనుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కన్స్యూమర్​ బ్యాంకింగ్​ సేవల నుంచి తప్పుకోవాలంటే ఖచ్చితంగా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ నుంచి గ్రీన్​ సిగ్నల్​ వచ్చే వరకు యథావిధిగా తమ సేవలు అందించనున్నట్లు సిటీ బ్యాంక్​ఇండియా చీఫ్​ఎగ్జిక్యూటివ్​ ఆశు ఖుల్లార్​ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తాజా ప్రకటనతో ప్రస్తుతానికైతే మా కార్యకలాపాల్లో తక్షణ మార్పులేమీ ఉండవు. అలాగే మా ఉద్యోగులపైనా దీని ప్రభావం ప్రభావం ఉండదు. కన్స్యూమర్​ సేవల నుంచి వైదొలిగేందుకు ఆర్‌బీఐ నుంచి గ్రీన్​సిగ్నల్ వచ్చే వరకు మా కస్టమర్లకు అదే అంకితభావం, శ్రద్ధతో మెరుగైన సేవలు కొనసాగిస్తాము. అవసరమైన నియంత్రణ అనుమతులు రాగానే విక్రయ ప్రక్రియ పూర్తిచేస్తాము.’’ అని అన్నారు.

కాగా, అంతర్జాతీయ ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిటీ బ్యాంక్​ వెల్లడించింది. ఇకపై సంస్థాగత బ్యాంకింగ్​ వ్యాపారంతో పాటు ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్ నగరాల్లోని కేంద్రాల నుంచి గ్లోబల్​ వ్యాపార కార్యకలాపాల్లో సర్వీసులను అందించడంపై దృష్టి పెట్టనుంది. భారత్​లో తమకున్న ఈ అయిదు నగరాల్లోని సిటీ సొల్యూషన్ సెంటర్ల కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా కార్పొరేట్, కమర్షియల్​, ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకింగ్, ట్రెజరరీ, ట్రేడ్​ సొల్యూషన్స్​తో పాటు మార్కెట్లు, సెక్యూరిటీ సర్వీసులను మరింత బలోపేతం చేయడంలో దృష్టి సారిస్తున్నట్లు సిటీ బ్యాంక్ గ్రూప్ పేర్కొంది.

Read Also…  నేటి నుంచి చార్మినార్, గోల్కొండ సందర్శన బంద్.. కరోనా నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ కీలక ఆదేశాలు