AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert!: LIC పాలసీదారులకు గమనిక.. వారంలో ఐదురోజులే పనిదినాలు…

LIC Working Days: ఎల్ఐసీ పాలసీదారులకు ముఖ్యమైన గమనిక. ఎల్ఐసీకి ప్రతీ శనివారం పబ్లిక్ హాలిడేను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది.

Alert!: LIC పాలసీదారులకు గమనిక.. వారంలో ఐదురోజులే పనిదినాలు...
Lic Policy
Sanjay Kasula
|

Updated on: Apr 16, 2021 | 3:14 PM

Share

ఎల్ఐసీ పాలసీదారులకు ముఖ్యమైన గమనిక. ఎల్ఐసీకి ప్రతీ శనివారం పబ్లిక్ హాలిడేను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ మోదీ సర్కార్.. మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగుల జీతంలో 15-16 శాతం పెంపుతోపాటు వారానికి ఐదు రోజులు వర్క్‌ పాలసీని ప్రభుత్వం ఆమోదించింది. ఎల్‌ఐసీ మేనేజ్‌మెంట్ చివరిసారిగా 16 శాతం వేతనాల పెంపును ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన చేస్తున్నప్పుడు వివిధ ఉద్యోగుల ఉద్యోగులు తీసుకున్న గృహ రుణాలపై వడ్డీ రేటులో 100 బేసిస్ పాయింట్ల తగ్గింపును యాజమాన్యం ప్రకటించింది.

ఎల్‌ఐసీ మేనేజ్‌మెంట్ ఇంతకు ముందు పంపిన ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద ఐపిఓను తీసుకురావడానికి ఎల్ఐసీ కూడా సిద్ధమవుతోందని వెల్లడించింది.

ఎల్ఐసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

ఎల్‌ఐసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీతాలు పెంచాలని నాలుగేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. వేతన పెంపు విషయమై ఎల్ఐసీ నాయకత్వం ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుతున్నాయి.

ఆగస్ట్ 1, 2017 నుండి ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తోంది. కానీ వాయిదా వేస్తూ వస్తోంది. వేతన పెంపు నిర్ణయం వాయిదాపడటం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. వేతన పెంపు 18.5 శాతం నుండి 20 శాతం మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది వారికి సంతృప్తిని కలిగించే విషయం. ఎల్ఐసీ యాజమాన్యం గతంలో 16 శాతం వేతన పెంపును అమలు చేసింది. ఇప్పుడు వేతన పెంపు సంకేతాలు ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్తే.

వారంలో ఐదు రోజులే పని దినాలు..

దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారాలకు ఇది ముఖ్య సూచన అని చెప్పవచ్చు. ఎందుకుంటే ఇంత కాలం వారంలో ఆరు రోజులు పనిచేస్తున్న ఉద్యోగులకు మరో రోజు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా ఎల్ఐసీ ఉద్యోగులు గత కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పని దినాలు తగ్గించాలని కోరారు. అయితే వారి ప్రతిపాధను అంగీకరిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి… South West Monsoon: 2021లో వర్షపాతం ఎలా ఉండబోతోంది.? కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. వివరాలు ఇవిగో.!

Sonu Sood : బ్యాండ్ వాలాగా మారిన రియల్ హీరో.. సోనులోని టాలెంట్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్…